జాతీయ రహదారిపై భద్రత కరువు

ABN , First Publish Date - 2022-06-11T06:01:33+05:30 IST

ఉమ్మడి జిల్లాలో 44వ జాతీయరహదారిపై ప్లైఓవర్‌లు కనబడటమే గగనమవుతోంది. ఈరహదా రి నాలుగులైన్ల రోడ్డుగా నిర్మాణం చేపట్టే సమయంలో రద్దీగా ఉం డే జంక్షనల వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టలేదు.

జాతీయ రహదారిపై భద్రత కరువు
సోమందేపల్లి వై-జంక్షన వద్ద ప్రమాదకరంగా మలుపులు తిరుగుతున్న వాహనాలు

ప్రధాన జంక్షన్లలో నిర్మాణం కాని ఫ్లైఓవర్లు 


సోమందేపల్లి, జూన 10: ఉమ్మడి జిల్లాలో 44వ జాతీయరహదారిపై ప్లైఓవర్‌లు కనబడటమే గగనమవుతోంది. ఈరహదా రి నాలుగులైన్ల రోడ్డుగా నిర్మాణం చేపట్టే సమయంలో రద్దీగా ఉం డే జంక్షనల వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఎన్నో ప్ర మాదాలకు కారణమవుతోంది. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల్లో మృతుల సంఖ్య భారీగా ఉంది. దీంతో ఎన్నో కుటుంబాలు శోకం లో మునుగుతున్నాయి. అదే పక్క రాష్ట్రం కర్ణాటకలో మాత్రం ప్ర తి జంక్షనవద్ద ప్లైఓవర్‌ నిర్మాణాలు చేపట్టారు. 44వ జాతీయరహదారి బాగేపల్లి, చిక్కబళ్లాపురం, పెరేసముద్రం లాంటి చిన్న జంక్షనల వద్ద కూడా ముందస్తు జాగ్రత్తగా ఫ్లైఓవర్లు నిర్మించా రు. కానీ మన రాష్ట్రంలో అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఫ్లైఓవర్లు మాత్రం ఒకటి, రెండు చోట్ల మాత్రమే దర్శనమిస్తున్నాయి. కర్ణాట క రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి రాగానే ప్రధానంగా చిలమత్తూ రు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద నిర్మించాల్సి ఉండేది. అ యితే అక్కడ ఎలాంటి ఫ్లైఓవర్లు నిర్మించకపోవడంతో నిత్యం ప్ర మాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లేపాక్షి ఆలయాన్ని దర్శించి బెంగళూరుకు వెళ్లే వాహనా లు జాతీయరహదారిని అడ్డుగా దాటుకుంటూనే వెళ్లాల్సి వస్తోం ది. 


ఇక్కడ ఇప్పటివరకు ఎందరో ప్రాణాలు కోల్పోవడం గమనా ర్హం. గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద పరిస్థితి ఇలాగే ఉం ది. ఇండస్ర్టియల్‌ ఏరియా హిందూపురానికి వెళ్లేందుకు కదిరి వై పు నుంచి వచ్చే భారీ వాహనాలు, కంటైనర్లు జాతీయరహదారిని అడ్డుగా దాటుతూనే హిందూపురం రోడ్డులోకి ప్రవేశించాల్సి రావడంతో గతంలో ఇక్కడ పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అ ప్పట్లో అధికారులు జిగ్‌జాగ్‌ పద్ధతిని ప్రవేశపెట్టి స్పీడ్‌ బ్రేకర్లు ఏ ర్పాటు చేయడంతో ప్రమాదాలు కొంతవరకు తగ్గాయి. అనంతరం సోమందేపల్లి మండల వై-జంక్షన వద్ద రద్దీగా ఉండే ప్రమాద కూడళ్లలో ఫ్లైఓవర్‌ నిర్మించకపోవడంతో జరిగిన ప్రమాదాలు ఎం దరినో బలితీసుకున్నాయి. ఇంత రద్దీగా ఉండే ప్రదేశాలను ముం దస్తుగా గుర్తించి ఫ్లైఓవర్‌ నిర్మాణాలు చేపట్టి ఉంటే ఎన్నో ప్రమాదాలు జరగకుండా ఉండేవని స్థానికులు పేర్కొంటున్నారు. 


ఉమ్మడి జిల్లాల్లో పెనుకొండ, సీకే పల్లి, ఎనఎ్‌సగేట్‌, మామిళ్లప ల్లి, రాప్తాడు, గుత్తి వద్ద కూడా ఉన్న జంక్షనలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల నుండి జాతీయ రహదారిపైకి రావాలంటే వాహనాలు అడ్డుగా రహదారిని దాటుకుని రావాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రహదారి నిర్మాణం చేపట్టే సమయంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ముందస్తుగానే పరిశీలించి ఫ్లైఓవర్లు ని ర్మించి ఉంటే ఎన్నో ప్రమాదాలు అరికట్టే అవకాశం ఉండేది. ఈ రహదారిపై ఇతర ప్రాంతాలవారు ప్రయాణిస్తూ ఉంటారు. వారి కి ఎక్కడ జంక్షనలు ఉంటాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంటోంది. వందకు పైగా వేగంగా ప్రయాణించే వాహనాలకు ఒ క్కసారిగా అటుగా వాహనాలు రావడంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. అంతేకాక జాతీయరహదారిపై ఎక్కడబడితే అక్కడ ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపివేస్తున్నారు. దీంతో తెల్లవారుజాములో ఆపి ఉన్న వాహనాన్ని గుర్తించలేక వేగంగా వచ్చే వాహనాలు వెనుక నుండి ఢీకొంటూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా యి. హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది జాతీయ రహదారిపై వాహనాల ను ఎక్కడ బడితే అక్కడ ఆపకుండా చర్యలు తీసుకుంటే ప్రమాదాలు నివారించవచ్చు. ఈ రహదారిపై వాహనాలను ఆపుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసినప్పటికీ వాటిని ఎవరూ వినియోగించుకోకుండా చిన్నపాటి హోటళ్లవద్ద, టీస్టాళ్ల ముందు యథేచ్ఛగా వాహనాలను ఆపుతూ ఉండటం జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు ప్రణాళికలు సిద్ధంచేసి ఫ్లైఓవర్‌ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


Updated Date - 2022-06-11T06:01:33+05:30 IST