సాధువులను ప్రశ్నిస్తున్న పోలీసులు
పి.గన్నవరం, జనవరి 22: మండలంలోని నరేంద్రపురం, బూరుగుగుంట, ముంగండ పరిసర ప్రాంతాలలో సాధువులు నాలుగు రోజుల నుంచి అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ జి.సురేంద్ర ముంగండలోని సాధువులు ప్రయాణిస్తున్న కారును పరిశీలించగా నలుగురు సాధువులు ఉన్నారు. వారిని విచారించగా యాత్రలో భాగంగా తిరుగుతున్నామని రామేశ్వరం వెళ్లాలని వారు తెలిపారు. అయితే వారు ఎటువంటి మాస్క్‌లు ధరించకపోవడంతో ఎస్‌ఐ జి.సురేంద్ర కౌన్సెలింగ్ ఇచ్చి వారిని విజయవాడ వైపు పంపించారు.