రికార్డును కోల్పోయినందుకు విచారంగా ఉంది: సౌతాఫ్రికా స్పిన్నర్ Robin Peterson

ABN , First Publish Date - 2022-07-03T02:08:43+05:30 IST

భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఒకే ఓవర్‌లో ఏకంగా 35 పరుగులు సమర్పించుకున్నాడు

రికార్డును కోల్పోయినందుకు విచారంగా ఉంది: సౌతాఫ్రికా స్పిన్నర్ Robin Peterson

బర్మింగ్‌హామ్: భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad) ఒకే ఓవర్‌లో ఏకంగా 35 పరుగులు సమర్పించుకున్నాడు. బ్రాడ్ వేసిన ఓవర్‌లో టీమిండియా స్టాండిన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) చెలరేగిపోయాడు. బంతులను ఉతికి ఆరేశాడు. నాలుగు ఫోర్లు, 6 సిక్సర్లు, ఒక సింగిల్‌తో ఏకంగా 29 పరుగులు సాధించాడు. దీనికితోడు బ్రాడ్ ఆరు ఎక్స్‌ట్రాలు ఇచ్చుకోవడంతో ఆ ఓవర్‌లో ఏకంగా 35 పరుగులు వచ్చాయి. ఫలితంగా టెస్టుల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా బ్రాడ్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.


ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా ఇప్పటి వరకు ఆ రికార్డు సౌతాప్రికా స్పిన్నర్ రాబిన్ పీటర్సన్‌ పేరుపై ఉండగా, ఇప్పుడా రికార్డును బ్రాడ్ బద్దలుగొట్టాడు. 2003లో విండీస్‌పై పీటర్స్‌న్ ఒకే ఓవర్‌లో 28 పరుగులు సమర్పించుకున్నాడు. తన రికార్డును బ్రాడ్ అధిగమించిన విషయం తెలిసిన మరుక్షణం పీటర్సన్ ట్వీట్ చేశాడు. ‘‘ఈ రోజు నా రికార్డును కోల్పోవడం విచారంగా ఉంది. నిజానికి రికార్డులున్నవి బద్దలుగొట్టేందుకే. ఇది కూడా బద్దలైపోతుంది’’ అని పేర్కొన్నాడు.


Updated Date - 2022-07-03T02:08:43+05:30 IST