సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి

ABN , First Publish Date - 2021-01-16T04:11:23+05:30 IST

సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని పత్తి గట్టయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పత్తి వెంకటేష్‌ అన్నారు. శుక్రవారం ఆర్మీ డేను పురస్కరించుకొని రైల్వేస్టేషన్‌ రోడ్డు నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి
జవాన్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఏబీవీపీ నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 15: సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని పత్తి గట్టయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పత్తి వెంకటేష్‌ అన్నారు. శుక్రవారం ఆర్మీ డేను పురస్కరించుకొని రైల్వేస్టేషన్‌ రోడ్డు నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు  కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వీర జవాన్ల త్యాగాలు మరువలేనివని, గడ్డకడుతున్న చలిని సైతం లెక్క చేయకుండా దేశరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న వారిని ప్రతీ ఒక్కరు స్మరించుకోవాలని పేర్కొన్నారు.  మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పబ్బతి కమలాకర్‌రావు, నాయకులు మోతె కన కయ్య, రాజేందర్‌, భీమిని రాజేష్‌, పన్యాల రాజు, సాగర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

ఏసీసీ: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో జవాన్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ రక్షణకు పోరాడుతున్న సైన్యానికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలన్నారు. వారి కృషిని, త్యాగాన్ని ఎప్పుడు మర్చిపోకూడదన్నారు. వేముల భరత్‌, ఆంజనేయులు, పాల్గొన్నారు. 

మందమర్రిటౌన్‌: పట్టణంలో శుక్రవారం రాత్రి ఆర్మీడే సందర్భంగా భగత్‌సిం గ్‌ యూత్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం ప్రాణాల ర్పించిన వీరజవాన్‌లకు నివాళులర్పించారు. భగత్‌సింగ్‌నగర్‌ నుంచి సింగరేణి పాఠశాల మైదానం వరకు ర్యాలీ కొనసాగింది.  

దండేపల్లి: జాతీయ సైనిక దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రంలో  యువకులు వేడుకలను నిర్వహించారు. గాంధీ విగ్రహాం వద్ద కేక్‌ కట్‌ చేసి మిఠాయి పంచి టపాసులు కాల్చారు. దేశ సంరక్షణ కోసం సైనికులు తన ప్రాణాలను లెక్క చేయకుండ పోరాడుతున్నారన్నారు. వారి త్యాగలు మరువ లేనివన్నారు. రిటైడ్‌ ఆర్మీ జవాన్‌, స్ధానిక యువకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T04:11:23+05:30 IST