త్యాగధనులను స్మరించుకోవాలి

ABN , First Publish Date - 2022-01-27T05:38:24+05:30 IST

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులను స్మరించుకుని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరీ అన్నారు.

త్యాగధనులను స్మరించుకోవాలి
కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో జెండాకు వందనం చేస్తున్న కలెక్టర్‌ భారతి హోళికేరీ

 - కలెక్టర్‌  భారతి హోళికేరీ 

- జిల్లా వ్యాప్తంగా నిరాడంబరంగా గణతంత్ర వేడుకలు

- జెండా ఎగురవేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 26 : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులను స్మరించుకుని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్‌  భారతి హోళికేరీ అన్నారు. కలెక్టరేట్‌ కార్యాలయం ఆవరణలో బుధవారం 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం  త్రివర్ణ పతాకాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వేడుకలు  నిరాడంబరంగా కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ సూచనల మేరకు పరిమిత సంఖ్యలో పాల్గొని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన చిరస్మరణీయ రోజు జనవరి 26 అని చెప్పారు. స్వాతంత్య్రం కోసం ఎందరో అమరులు తమ ధన, ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చారని  తెలిపారు. అటువంటి మహానీయులను స్మరిస్తూ వారి ఆశయాలను కొనసాగించాలన్నారు. గణతంత్ర వేడుకలకు అడ్డుగా నిలిచిన కరోనా మమహ్మారిపై పోరాటం సాగించాలని , వంద శాతం వ్యాక్సినేషన్‌ ద్వారానే ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని ఏర్పరుచుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఏసీపీ సాధనరష్మీపెరుమాళ్‌, అడిషనల్‌ కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, ఆర్డీవో వేణు, డీఆర్‌డీవ శేషాద్రి, డీసీఎస్‌వో ప్రేంకుమార్‌, ఏవో సురేష్‌, డీపీఆర్‌వో సంపత్‌కుమార్‌, డీఎంహెచ్‌వో కొమురం బాలు, క్రీడల అధికారి శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జడ్పీ సీఈవో నరేందర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ జెండాకు వందనం చేశారు. కార్యక్రమంలో  చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, డిప్యూటీ సీఈవో లక్ష్మీనారాయణ, అధికారులు భాస్కర్‌, వెంకటేష్‌, అనిల్‌కుమార్‌, శ్రావణ్‌, సన్నీ, శ్రీనివాస్‌, కుమార్‌, సుమిత్‌, వెంకటేష్‌, గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయం ఆవరణలో పార్టీ రాష్ట్ర సమితి కార్యదర్శివర్గసభ్యులు కలవేని శంకర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి కలీందర్‌ఆలీఖాన్‌, రాష్ట్ర సమితి సభ్యుడు రామడుగు లక్ష్మణ్‌, ఎఐటీయూసీ జిల్లా కార్యదర్శిమేకల దాసు, భీమనాధుని సుదర్శన్‌, దేవి పోచ్చన్న, శంకరయ్య, రావు, రాజేశం, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. పత్తి గట్టయ్య ట్రస్టు చైర్మన్‌ పత్తి వెంకటేష్‌ ఆధ్వర్యంలో 73వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కలామకర్‌రావు, మోతె కనకయ్య, నగేష్‌, సాగర్‌, శ్రీకాంత్‌, రాజు పాల్గొన్నారు.    

ఏసీసీ: జిల్లా కేంద్రంలో గణతంత్రవేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్ధానిక ఎమ్మెల్యే దివాకర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.  మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో మున్సిపల్‌ కమీషనర్‌ బాలకృష్ణ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య పాల్గొన్నారు. హైటెక్‌సిటీలో మంచిర్యాల కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జెండా ఎగురవేశారు.  కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సీ ప్రేంసాగర్‌రావు, నాయకులు చిట్ల సత్యనారాయణ,  పూదరి తిరుపతి, బాబన్న, పెంట రజిత, శ్రీలతసదానందం, ఉప్పలయ్య, బానేష్‌, తూముల నరేష్‌ తదితరులు పాల్గొన్నారు. అర్చనటెక్స్‌ చౌరస్తాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన చేశారు. మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో మంచిర్యాల ఏసీపీ సాధన రష్మీపెరుమాల్‌ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు.  కార్యక్రమంలో పట్టణ సీఐలు నారాయణనాయక్‌, శ్రీనివాస్‌, ఎస్‌ఐలు తహసీనుద్దీన్‌, కిరణ్‌, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జిల్లా గ్రంథాలయలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌ ,  డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు,  మంచిర్యాల జిల్లా రెండవ అదనపు కోర్టులో రెండవ అదనపు జిల్లా జడ్జి వెంకటేష్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసు వందనం సమర్పించారు. జూనియర్‌ సివిల్‌ జడ్జిలు, ఏపీపీలు ,  న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.  పెయింటర్స్‌ సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు సదానం దం జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జమీల్‌, సునీల్‌, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు. బీసీ జాగృతి ఆధ్వర్యంలో రెడ్డి కాలనీలో గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు.  కార్యక్రమంలో గుమ్ముల శ్రీనివాస్‌, రవి, సదానందం తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని హమాలీ సంఘం కార్యాలయంలో సంఘం గౌరవాద్యక్షుడు సుదమల్ల హరికృష్ణ  జెండా ఎగురవేశారు. 


Updated Date - 2022-01-27T05:38:24+05:30 IST