సమాజ శ్రేయస్సు కోసమే ప్రాణ త్యాగం

ABN , First Publish Date - 2021-10-28T05:58:39+05:30 IST

సమాజ శ్రేయస్సు, ప్రశాంతత కోసమే విధి నిర్వహణలో పోలీసులు ప్రాణ త్యాగాలు చేస్తున్నారని అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణా టాటా, జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప పేర్కొన్నారు.

సమాజ శ్రేయస్సు కోసమే ప్రాణ త్యాగం
కొవ్వొత్తుల ర్యాలీలో డీఐజీ, ఎస్పీ, జడ్పీ చైర్‌పర్సన, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, మార్కెట్‌ యార్డు చైౖర్మన, కమిషనర్‌, అడిషనల్‌ఎస్పీ తదితరులు

డీఐజీ కాంతిరాణాటాటా, 

జిల్లా ఎస్పీ డాక్టర్‌  ఫక్కీరప్ప

నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ

అనంతపురం క్రైం, అక్టోబరు 27: సమాజ శ్రేయస్సు, ప్రశాంతత కోసమే విధి నిర్వహణలో పోలీసులు ప్రాణ త్యాగాలు చేస్తున్నారని అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణా టాటా, జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప పేర్కొన్నారు. పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా బుధవారం నగరంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారిద్దరితో పాటు జడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ, నగర మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్య హాజరయ్యారు. ముందుగా పోలీసు అమర వీరులను స్మరించుకుని స్థానిక వైజంక్షన నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. సప్తగిరి సర్కిల్లో పోలీసు వాయిద్యాల బృందాలు, పోలీసు కళాజాతా బృందాలు పలు ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అలరించారు. అ నంతరం డీఐజీ, ఎస్పీలు మాట్లాడుతూ కొవిడ్‌ నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా పోలీసులు సేవలందించారని గుర్తు చేశారు.  పోలీసులు అందిస్తున్న సేవలను ప్రజలందరూ గుర్తించి గౌరవించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, ఓఎస్డీ రామకృష్ణప్రసాద్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ హనుమంతు, డీఎస్పీలు శ్రీనివాసులు, ప్రసాదరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ పీవీఎనఎ్‌స మూర్తి, జిల్లా పోలీసు అధికారుల అడహక్‌ కమిటీ సభ్యులు త్రిలోక్‌నాథ్‌, సుధాకర్‌రెడ్డి, తేజ్‌పాల్‌, సరోజ పలు వురు సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T05:58:39+05:30 IST