మహానుభావుల త్యాగాలతో స్వేచ్ఛ

ABN , First Publish Date - 2022-08-14T06:29:51+05:30 IST

ఎందరో మహానుభావులు దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించడంతో నేడు స్వేచ్ఛ వాయువులను అనుభవిస్తున్నామని కొవ్వూరు ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు అన్నారు.

మహానుభావుల త్యాగాలతో స్వేచ్ఛ
కొవ్వూరులో జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

  • కొవ్వూరు ఆర్డీవో మల్లిబాబు
  • పలుచోట్ల ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌
  • జాతీయ జెండాలతో విద్యార్థుల ర్యాలీలు, మానవహారాలు

కొవ్వూరు, ఆగస్టు 13: ఎందరో మహానుభావులు దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించడంతో నేడు స్వేచ్ఛ వాయువులను అనుభవిస్తున్నామని కొవ్వూరు ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు అన్నారు. శనివారం పలుచోట్ల ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం నిర్వహించారు. విద్యా ర్థులు జాతీయ పతాకాలతో ర్యాలీలు చేట్టారు. మానవహారాలు ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా కొవ్వూరు హోలి ఏంజిల్స్‌ పాఠశాల ఆధ్వర్యంలో జాతీయ పతాకాలతో అలంకరించిన సైకిళ్లపై విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎస్పీ బి.శ్రీనాథ్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా పాఠశాల కరస్పాండెంట్‌ వి.నెల్సన్‌ ఆంటోని.. ఆర్డీవో, డీఎస్పీ, తహశీల్దార్‌ బి.నాగరాజ నాయక్‌లను సత్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుచేసుకుంటూ గత ఆగస్టు 15 నుంచి ఈ ఏడాది ఆగస్టు 15 వరకు అమృతోత్సవాలు నిర్వహించినట్టు ఆర్డీవో చెప్పారు. కొందరు అజ్ఞానులు ఇంటిపై జెండా కడితే దేశం మారిపోతుందా అని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, వారి అజ్ఞానాన్ని క్షమించడం తప్ప చేసేదేమి లేదన్నారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‌ జెస్సీనెల్సన్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T06:29:51+05:30 IST