కొలిక్కి వచ్చిన ‘సచివాలయ’ నియామక ప్రక్రియ

ABN , First Publish Date - 2020-11-30T06:19:03+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియ దాదాపు గా పూర్తయింది. మిగిలిపోయిన పోస్టుల భర్తీలో భా గంగా మలిదఫా నియామక ఉత్తర్వులను సోమ, మంగళవారాల్లో ఇచ్చే అవకాశముంది.

కొలిక్కి వచ్చిన ‘సచివాలయ’ నియామక ప్రక్రియ

నేడో, రేపో నియామకపత్రాలు 

మిగిలిపోనున్న 548 పోస్టులు


ఒంగోలు(జడ్పీ), నవంబరు 29:  గ్రామ, వార్డు  సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియ దాదాపు గా పూర్తయింది. మిగిలిపోయిన పోస్టుల  భర్తీలో భా గంగా మలిదఫా నియామక ఉత్తర్వులను సోమ, మంగళవారాల్లో ఇచ్చే అవకాశముంది. ఈ నెల  27కే ప్రక్రియను పూర్తి చేద్దామనుకున్న అధికారులకు ని వర్‌ తుపాను రూపేణా ఆటంకం కలగడంతో ఆల స్యం జరిగింది. ఆయా విభాగాల యంత్రాంగం అం తా తుపాను విధుల్లో ఉండడంతో వాయిదా పడింది. రెండోదఫా 422మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీ లన పూర్తి చేసుకున్నారు. డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ ఆ మోదముద్ర వేసిన తరువాత అధికారికంగా వీరందరి కి  నియామక పత్రాలను అందించనున్నారు. ఈ నెల 14న వివిధ విభాగాలకు చెందిన 521 మంది అభ్యర్థు లకు ఆయా  శాఖల అధికారులు నియామక పత్రా లు అందించిన సంగతి విదితమే. పోస్టులు ఎక్కువగా మిగిలిపోవడంతో కటాఫ్‌ను కనీసం ఒకటిగా పరిగణ నలోకి తీసుకుని అర్హులైన మరికొంత మందిని నియ మించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయ తీరాజ్‌శాఖ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దానిలో భాగంగానే రోస్టర్‌, రిజర్వేషన్‌, మార్కులు త దితర ప్రామాణికాలను అన్నిటినీ పరిగణనలోకి తీసు కున్న పిదప  రెండో దఫా 422 మందికి కొలువులు దక్కనున్నాయి. ఇంకా ఆయా విభాగాలకు సంబం ధించి అర్హులైన వారు లేకపోవడంతో  548 పోస్టులు మిగిలిపోనున్నాయి. ప్రధానంగా యానిమల్‌  హజ్బెం డరీ అసిస్టెంట్‌ విభాగంలో అర్హులు లేక అత్యధికంగా 367 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విభాగంలో మొ త్తం 522 ఖాళీలు ఉండగా 177 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. సాంకేతిక కారణాలతో 22 మంది అ ర్హత సాధించలేదు. తొలి దఫాలో ఈ విభాగంలో 131 మందికి నియామక పత్రాలిచ్చారు. రెండో దఫాలో 24 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న వా రిలో ఉన్నారు. మిగిలిన 367 ఖాళీలను తరువాత భ ర్తీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. దివ్యాంగుల కోటాలో కూడా అర్హులు లేక భర్తీ కాలేదు. అర్హత క లిగిన ఏ ఒక్కరికీ  అన్యాయం జరగకుండా నిబంధన లకు లోబడి పూర్తి పారదర్శకంగా నియామక ప్రక్రి య చేపట్టామని జిల్లా పరిషత్‌ సీఈవో కైలాస్‌గిరీ శ్వర్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 


Updated Date - 2020-11-30T06:19:03+05:30 IST