సచివాలయ ‘స్పందన’కు సిబ్బంది హాజరు తప్పనిసరి: జేసీ

ABN , First Publish Date - 2021-03-05T05:46:15+05:30 IST

సచివాలయంలో జరిగే ‘స్పందన’కు సిబ్బంది హాజరు తప్పనిసరి అని జేసీ కీర్తి చేకూరి పేర్కొన్నారు.

సచివాలయ ‘స్పందన’కు   సిబ్బంది హాజరు తప్పనిసరి: జేసీ

పెద్దాపురం, మార్చి 4: సచివాలయంలో జరిగే ‘స్పందన’కు సిబ్బంది హాజరు తప్పనిసరి అని జేసీ కీర్తి చేకూరి పేర్కొన్నారు. మండల పరిధిలోని జి.రాగంపేట సచివాలయాన్ని గురువారం ఆమె పరిశీలించారు. గత డిసెంబరు నుంచి ఇప్పటివరకు మీ-సేవ కేంద్రాల్లో అర్జీలు పెరుగుతున్నాయని, సచివాలయాల్లో తగ్గాయని... దీనికి కారణాలు కావాలన్నారు. ఏప్రిల్‌ నుంచి సచివాలయ సిబ్బంది జీతాలను బయోమెట్రిక్‌ ద్వారా అనుసంధానం చేస్తామన్నారు. దీనికి ఒక లాగిన్‌ ఇస్తామని చెప్పారు. ‘స్పందన’ జరిగే రోజున మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సిబ్బంది సచివాలయంలోనే ఉండాలన్నారు. అనంతరం బయోమెట్రిక్‌ హాజరును పరిశీలించారు. నాడు-నేడు పనులను పరిశీలించి, మధ్యాహ్న భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఎల్పీవో ప్రసాద్‌, ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, తహశీల్దారు బూసి శ్రీదేవి, ఎంఈవో జోసెఫ్‌, ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి, పంచాయతీ కార్యదర్శి సెలెట్‌రాజు, హెచ్‌ఎం కెనడీ పాల్గొన్నారు.




Updated Date - 2021-03-05T05:46:15+05:30 IST