గ్రామ సచివాలయాల్లో సేవలు మెరుగుపడాలి

ABN , First Publish Date - 2020-12-03T06:30:41+05:30 IST

గ్రామ సచివాలయాల్లో సేవలు మరింత మెరుగుపడాలని, ప్రజలకు అవసరమైన అన్ని సేవలు ఇక్కడ అందాలని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అన్నారు.

గ్రామ సచివాలయాల్లో సేవలు మెరుగుపడాలి
హుకుంపేట సచివాలయంలో బోర్డులు పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌


ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ 


హుకుంపేట, డిసెంబర్‌ 2: గ్రామ సచివాలయాల్లో సేవలు మరింత మెరుగుపడాలని, ప్రజలకు అవసరమైన అన్ని సేవలు ఇక్కడ అందాలని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. తొలుతగా రంగశీల గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. అక్కడి పాఠశాలలో చేపట్టిన నాడు- నేడు పనులు పరిశీలించారు. తర్వాత కొట్నాపల్లి పాఠశాలలో రూ.18 లక్షలతో చేపట్టిన నాడు- నేడు పనులు పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయ పనులను తనిఖీ చేశారు. రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం హుకుంపేటలోని గ్రామసచివాలయాన్ని సందర్శించి, ప్రభుత్వ పథకాల బోర్డులు పరిశీలించారు. సమాచారం సక్రమంగా లేకపోవడంతో పీవో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంఈవో ఎస్‌.రామచంద్రరావు, టీడబ్ల్యూ ఏఈఈ దేముడు, తదితరులు వున్నారు. 


సచివాలయాల్లో ఆర్డీవో తనిఖీలు

పెదబయలు: పాడేరు ఆర్డీవో కె.లక్ష్మీశివజ్మోతి బుధవారం అడుగులపుట్టు గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజలకు అన్ని రకాల సేవలను సత్వరమే అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విధులకు సకాలంలో హాజరుకావాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ముంచంగిపుట్టు మండలం ఎనుగురాయి సచివాలయాన్ని తనిఖీ చేశారు. పథకాల వివరాలు నోటీసు బోర్డులో లేకపోవడాన్ని గుర్తించి, వెంటనే ఏర్పాటు చేయాలని సిబ్బందిని  ఆదేశించారు. కార్యాలయ భవనం బాగోలేదని,  వెంటనే బాగుచేయించాలని మండల అధికారులను ఆదేశించారు.



Updated Date - 2020-12-03T06:30:41+05:30 IST