వివాదాస్పద భూమిని పరిశీలిస్తున్న ఆర్డీవో మురళి
రామసముద్రం మే 17: సచివాలయ వ్య వస్థను పటిష్టం చేయాలని మదనపల్లె ఆర్డీ వో మురళి ఆదేశించారు. మంగళవారం రా మసముద్రం మండలంలోని మినికి సచివా లయంలోని రికార్డులను ఆయన పరిశీలించా రు. అనంతరం మాట్లాడుతూ బయోమె ట్రిక్, అటెండెన్స్ ఖచ్చితంగా 10.30 గంటల లోపే వేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. సిబ్బంది మూమెంట్ రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయాలని, యూనిఫాం ధరించాలని సూచించారు. ఇన్ చార్జి ఎంపీడివో సురేష్‌బాబు, తహసీల్దార్ విశ్వేశ్వరశాస్త్రి, సర్పంచ్ జమున, పంచాయతీ కార్యదర్శి మమత, సర్వేయర్ వాసు, వీఆర్వో పాపారాయుడు, వీఆర్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.
వివాదాస్పద భూమి పరిశీలన
మినికి గ్రామరెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 271-1, 272-2 లోని భూమిని ఆయన పరిశీలించారు. ఈ భూములను వెం టనే స్వాధీనం చేసుకోవాలని పంచాయతీ సర్పంచ్‌కు సూచించారు. ఎవరైనా ఈ భూ మిలో ప్రవేశిస్తే కఠినచర్యలు తప్పవన్నారు. ఫిర్యాదుదారులు పవన్‌కుమార్‌రెడ్డి, వెంకట రమణను పిలిపించి ఆ భూమితో వారి ఎలాంటి సంబంధం లేదని ఇకపై ఆ భూమి లోకి వెళ్లరాదని ఆదేశించారు. తహసీల్దార్ విశ్వేశ్వరశాస్త్రి, రెవన్యూసిబ్బంది పాల్గొన్నారు.