ఒలింపిక్స్‌లో కమల్ ప్రీత్ ఒలింపిక్ ఓటమిపై సచిన్ ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2021-08-03T09:41:15+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో 25ఏళ్ల కమల్ ప్రీత్ కౌర్ పోరాటం ముగిసింది. సోమావారం జరిగిన డిస్కస్ త్రో ఫైనల్స్‌లో కమల్ ప్రీత్ 6వ స్థానంతో ..

ఒలింపిక్స్‌లో కమల్ ప్రీత్ ఒలింపిక్ ఓటమిపై సచిన్ ఏమన్నాడంటే..

టోక్యో ఒలింపిక్స్‌లో 25ఏళ్ల కమల్ ప్రీత్ కౌర్ పోరాటం ముగిసింది. సోమావారం జరిగిన డిస్కస్ త్రో ఫైనల్స్‌లో కమల్ ప్రీత్ 6వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు అండగా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నిలబడ్డాడు. ఆమె ఓటమిపై స్పందిస్తూ.. కొన్ని ఓటమి మనకు ఎన్నో నేర్పిస్తుందంటూ కామెంట్ చేశాడు. ‘కొన్ని సార్లు మనం గెలుస్తాం. కొన్ని సార్లు మనం నేర్చుకుంటాం. నీ వంతు ప్రయత్నం చేశావ్ కమల్‌ప్రీత్. అంత పెద్ద వేదికపై భారత దేశానికి ప్రాతినిథ్యం వహించి.. గెలుపు కోసం నీ శాయశక్తులా ప్రయత్నించినందుకు మేమంతా గర్వపడుతున్నాం’ అని సచిన్ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.


కాగా.. శనివారం జరిగిన పోటీల్లో ఫైనల్‌కు అర్హత సాధించిన కమల్ ప్రీత్.. ఆదివారం ఫైనల్స్‌లో మొత్తం 8 రౌండ్లలో పోటీ పడింది. కానీ కనీస పోటీ కూడా ఇవ్వలేదు. మొత్తం 6 సార్లలో 3 సార్లు ఫౌల్ వేసిన కమల్‌ప్రీత్.. అత్యుత్తమంగా 63.70 మీటర్స్ మాత్రమే విసరగలిగింది. దీంతో పోటీలో 6వ స్థానంతో సరిపెట్టుకుంది.

Updated Date - 2021-08-03T09:41:15+05:30 IST