తొలి, చివరి మ్యాచ్‌ల్లో సచినే నాన్‌స్ట్రయికర్‌..

ABN , First Publish Date - 2020-03-29T10:05:39+05:30 IST

సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ భారత క్రికెట్‌ జట్టుకు విజయవంతమైన ఓపెనర్లుగా పేరు తెచ్చుకున్నారు. 136 వన్డేల్లో 6,609 పరుగులు, 21 శతక ...

తొలి, చివరి మ్యాచ్‌ల్లో సచినే నాన్‌స్ట్రయికర్‌..

న్యూఢిల్లీ: సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ భారత క్రికెట్‌ జట్టుకు విజయవంతమైన ఓపెనర్లుగా పేరు తెచ్చుకున్నారు. 136 వన్డేల్లో 6,609 పరుగులు, 21 శతక భాగస్వామ్యాలు నమోదు చేసిన ఘనత వీరిది. క్రికెట్‌ నుంచి తప్పుకొన్నాక కూడా వీరి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది.  అయితే చాలామందికి తెలియని ఓ అరుదైన సన్నివేశం కూడా వీరి మధ్య చోటు చేసుకుంది. 1992లో గంగూలీ తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాట్‌ పట్టుకుని క్రీజులో అడుగుపెట్టినప్పుడు నాన్‌స్ట్రయిక్‌ ఎండ్‌లో ఉన్నది సచిన్‌ టెండూల్కర్‌. ఇక 2008లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌తో గంగూలీ తన కెరీర్‌ను ముగించాడు. విచిత్రంగా ఆ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌లోనూ దాదా ఆడేందుకు వచ్చినప్పుడు సచిన్‌ మరో ఎండ్‌లో ఉండడం గమ్మత్తైన విషయమే.  

Updated Date - 2020-03-29T10:05:39+05:30 IST