ముంబై: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుపై టీమిండియా క్రికెట్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో దేశానికి రజత పతకం అందించిన రెండో క్రీడాకారిణిగా మీరాబాయి రికార్డులకెక్కింది. 2000వ సంవత్సరంలో సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్‌లో మళ్లీశ్వరి 69 కేజీ కేటగిరీలో కాంస్య పతకం సాధించింది.
మీరాబాయి చాను విజయంపై సచిన్ స్పందిస్తూ.. వెయిట్ లిప్టింగ్లో మీరాబాయి చాను అత్యద్భుత ప్రదర్శన కనబరించిందని ట్వీట్ చేశాడు. గాయం తర్వాత కోలుకుని తనను తాను మలచుకున్న తీరు అద్భుతమని కొనియాడాడు. రజత పతకంతో భారత్‌కు గర్వకారణంగా నిలిచిందని సచిన్ ప్రశంసలు కురిపించాడు.