విండీస్‌పై సచిన్, విరాట్ ప్రశంశల వర్షం

ABN , First Publish Date - 2020-07-13T23:00:12+05:30 IST

కరోనాలో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచానికి ఇంగ్లాండ్ క్రికెట్ ట్రీట్ ఇచ్చింది. విండీస్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రసవత్తరంగా...

విండీస్‌పై సచిన్, విరాట్ ప్రశంశల వర్షం

న్యూఢిల్లీ: కరోనాలో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచానికి ఇంగ్లాండ్ క్రికెట్ ట్రీట్ ఇచ్చింది. విండీస్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రసవత్తరంగా సాగిన తొలి టెస్ట్ క్రికెట్ అభిమానులకు గొప్ప మజానిచ్చింది. కరోనా భయాలను పక్కన పెట్టి ఇంగ్లాండ్ వచ్చిన విండీస్ తొలి మ్యాచ్‌లో గొప్ప విజయాన్ని చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్, విండీస్ మాజీ క్రికెటర్లతో పాటు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విండీస్‌ను ప్రశంశించారు. విండీస్ చక్కటి ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచిందని, అందుకు హోల్డర్‌ జట్టుకు శుభాకాంక్షలని తెలిపారు. భారత జట్టు  ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీలు కూడా విండీస్ ఆటతీరును మెచ్చుకున్నాడు. టెస్ట్ క్రికెట్ మజాను ఇంగ్లాండ్-విండీస్‌ జట్లు మరోసారి రుచిచూపించాయని అభినందించాడు. వీరితో మరికొంత మంది భారత క్రికెటర్లు కూడా విండీస్‌ను మెచ్చుకున్నారు.





Updated Date - 2020-07-13T23:00:12+05:30 IST