స్మిత్‌ను ఎలా అడ్డుకోవాలంటే..

ABN , First Publish Date - 2020-11-25T09:50:40+05:30 IST

ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ను అడ్డుకోవాలంటే టీమిండియా ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగాలని బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సూచించాడు.

స్మిత్‌ను ఎలా   అడ్డుకోవాలంటే..

టీమిండియా పేసర్లకు సచిన్‌ సలహా


న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ను అడ్డుకోవాలంటే టీమిండియా ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగాలని బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సూచించాడు. భారత పేసర్లు ‘ఫిఫ్త్‌ స్టంప్‌’ను లక్ష్యంగా చేసుకుని బంతులు విసరాలని సలహా ఇచ్చాడు. ‘స్మిత్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ విభిన్నంగా ఉంటుంది. బంతి వేయడానికి ముందే స్టాన్స్‌ మార్చుకుంటాడు. మామూలుగా టెస్టుల్లో బౌలర్లకు ఆఫ్‌ స్టంప్‌ మీదుగా లేకుంటే నాలుగో స్టంప్‌ లైన్‌లో బంతులు వేయాలని చెబుతుంటాం. కానీ స్మిత్‌ విషయంలో ఇలా కుదరదు. అతడి శైలి కారణంగా బంతి మరో ఐదు అంగుళాల దూరంలో వేయాల్సి ఉంటుంది. ఎక్కువగా బ్యాక్‌ఫుట్‌తో ఆడే విధంగా బంతులు వేసి అతను తప్పులు చేసేలా చూడాలి’ అని సచిన్‌ వివరించాడు.

Updated Date - 2020-11-25T09:50:40+05:30 IST