ఫెడరర్‌.. ఫోర్‌హ్యాండ్‌ షాట్‌పై సలహా ఇవ్వు: సచిన్‌

ABN , First Publish Date - 2020-07-05T08:51:51+05:30 IST

భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ టెన్ని్‌సను కూడా అమితంగా ఇష్టపడుతుంటాడు. వీలు చిక్కినప్పుడల్లా వింబుల్డన్‌ పోటీలను ...

ఫెడరర్‌.. ఫోర్‌హ్యాండ్‌ షాట్‌పై సలహా ఇవ్వు: సచిన్‌

ముంబై: భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ టెన్ని్‌సను కూడా అమితంగా ఇష్టపడుతుంటాడు. వీలు చిక్కినప్పుడల్లా వింబుల్డన్‌ పోటీలను ప్రత్యక్షంగా తిలకించేందుకు లండన్‌ కూడా వెళుతుంటాడు. తాజాగా తాను టెన్నిస్‌ ఆడుతున్న ఓ పాత వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన సచిన్‌.. ఓ షాట్‌పై స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ను సలహా కోరాడు. ఇందులో కాస్త గాల్లోకి ఎగిరి మరీ అద్భుత ఫోర్‌హ్యాండ్‌ షాట్‌ కొట్టడం కనిపిస్తుంటుంది. ‘హేయ్‌.. రోజర్‌ ఫెడరర్‌. నా ఫోర్‌హ్యాండ్‌ షాట్‌పై ఏమైనా సలహాలు ఇస్తావా?’ అని సరదాగా ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశాడు.

Updated Date - 2020-07-05T08:51:51+05:30 IST