మాస్టర్‌ క్రమశిక్షణకు ఆ ‘241’ నిదర్శనం

ABN , First Publish Date - 2020-04-05T09:55:55+05:30 IST

బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌ కనిపిస్తాయి. అయితే ఆసీస్‌ పర్యటనలో అతడు చేసిన డబుల్‌ సెంచరీ

మాస్టర్‌ క్రమశిక్షణకు ఆ ‘241’ నిదర్శనం

న్యూఢిల్లీ: బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌ కనిపిస్తాయి. అయితే ఆసీస్‌ పర్యటనలో అతడు చేసిన డబుల్‌ సెంచరీ అత్యంత క్రమశిక్షణతో కూడినదని విండీస్‌ గ్రేట్‌ బ్రయాన్‌ లారా అభిప్రాయపడ్డాడు. ‘16 ఏళ్ల వయస్సులో టెస్టుల్లో అరంగేట్రం చేసిన క్రికెటర్‌ ఆ తర్వాత 24 ఏళ్లపాటు కొనసాగడం మామూలు విషయం కాదు. సచిన్‌ తన కెరీర్‌లో ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌ ఆడి ఉండొచ్చు. కానీ సిడ్నీ మైదానంలో అతడు అజేయంగా సాధించిన 241 పరుగులు మాత్రం అత్యంత క్రమశిక్షణ, అంకితభావం కారణంగా వచ్చినవి. ఇప్పుడీ కరోనాను ఎదుర్కొనేందుకు కూడా అలాంటి పట్టుదలే కావాలి’ అని లారా ఇన్‌స్టాగ్రామ్‌లో పిలుపునిచ్చాడు. 2004 టూర్‌లో సచిన్‌ ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడ్డాడు. అతడిని అవుట్‌ చేసేందుకు ఆసీస్‌ బౌలర్లు కవర్‌ డ్రైవ్‌ ఆడేలా ఊరిస్తూ దెబ్బతీశారు. కానీ చివరి టెస్టులో మాత్రం ఒక్కసారి కూడా అలాంటి షాట్లకు వెళ్లకుండా ఏకాగ్రతతో ఆడి ద్విశతకంతో సత్తా చాటుకున్నాడు. 


Updated Date - 2020-04-05T09:55:55+05:30 IST