ఎన్నో ఏళ్లు ఒత్తిడికి లోనయ్యా
ABN , First Publish Date - 2021-05-17T09:25:40+05:30 IST
తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో..ఎన్నో సంవత్సరాలు ఒత్తిడి ఎదుర్కొన్నానని సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు.
న్యూఢిల్లీ: తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో..ఎన్నో సంవత్సరాలు ఒత్తిడి ఎదుర్కొన్నానని సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. అయితే మ్యాచ్కు సిద్ధమయ్యే క్రమంలో ఇలాంటి ఒత్తిడి, ఆందోళన సహజమేనని తదనంతర కాలంలో గ్రహించానని చెప్పాడు. ‘మ్యాచ్కు శారీరకంగానేకాదు మానసికంగానూ సిద్ధం కావడం ముఖ్యమని తెలుసుకున్నా. అందుకే గ్రౌండ్లోకి వెళ్లడానికి ఎంతోముందే నేను మ్యాచ్ మూడ్లోకి ప్రవేశించేవాడిని. ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉండేది’ అని మానసిక ఆరోగ్యంపై జరిగిన చర్చలో సచిన్ తెలిపాడు.