Abn logo

సగ్గుబియ్యం అట్లు

కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం - ఒక కప్పు, వేగించిన పల్లీలు - పావుకప్పు, పచ్చిమిర్చి - 3, వెల్లుల్లి రెబ్బలు - 3, ఉడికించిన బంగాళదుంపలు - 2, కొత్తిమీర తరుగు - అరకప్పు, జీలకర్ర - ఒక టీ స్పూను, ఎండు మిర్చి బరక - ఒక టీ స్పూను, నూనె - కాల్చడానికి, ఉప్పు - రుచికి సరిపడా.  


తయారుచేసే విధానం: సగ్గుబియ్యాన్ని నీటిలో కనీసం మూడుసార్లు బాగా కడిగి ఒక కప్పు నీటిలో 4 గంటలు నానబెట్టాలి. పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి మిక్సీలో బరకగా పొడి చేయాలి. ఒక పాత్రలో నానిన సగ్గుబియ్యంతో పాటుగా పల్లీల మిశ్రమం, తురిమిన బంగాళదుంపలు, కొత్తిమీర తరుగు, జీలకర్ర, ఉప్పు, ఎండు మిర్చి బరక వేసి బాగా కలిపి ముద్దగా చేయాలి. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజులో ఉండలు చేసి నూనె రాసిన ప్లాస్టిక్‌ పేపరుపై పూరీ సైజులో దళసరిగా ఒత్తి పెనంపై రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. అట్లు విరగకుండా రావాలంటే మంట పెద్దగా ఉండరాదు. చిన్నమంటపైనే కాల్చాలి. ఈ అట్లకు పెరుగు చట్నీ మంచి కాంబినేషన్‌. 

చిట్టి బుడగలుబీట్‌రూట్ కట్‌లెట్వెజ్‌ పిజ్జాసగ్గుబియ్యం గ్రీన్ కిచిడిబ్రెడ్ దోశలుమిక్చర్‌మినీ సోయా ఊతప్పంకొత్తిమీర అటుకులుగుజియాసేమియా ఉప్మా!
Advertisement
d_article_rhs_ad_1
Advertisement