సగ్గుబియ్యం కిచిడీ

ABN , First Publish Date - 2020-03-15T17:35:34+05:30 IST

సగ్గుబియ్యం - ఒకటిన్నర కప్పు, పల్లీలు - పావు కప్పు, పచ్చిమిర్చి - 4, బంగాళదుంప - 1, నెయ్యి - 3 టేబుల్‌ స్పూన్లు, కరివేపాకు - 4 రెబ్బలు, ఉప్పు - రుచికి సరిపడా, జీలకర్ర -

సగ్గుబియ్యం కిచిడీ

కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం - ఒకటిన్నర కప్పు, పల్లీలు - పావు కప్పు, పచ్చిమిర్చి - 4, బంగాళదుంప - 1, నెయ్యి - 3 టేబుల్‌ స్పూన్లు, కరివేపాకు - 4 రెబ్బలు, ఉప్పు - రుచికి సరిపడా, జీలకర్ర - 1 టీ స్పూను, నిమ్మరసం - ఒక టేబుల్‌ స్పూను, పచ్చికొబ్బరి తురుము - 2 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు - అరకప్పు, పసుపు - చిటికెడు.


తయారుచేసే విధానం: శుభ్రంగా కడిగిన సగ్గుబియ్యంలో ఒక కప్పు నీరుపోసి 4 గంటలు నానబెట్టాలి. పల్లీలు వేగించి పొట్టుతీసి బరకగా మిక్సీ పట్టాలి. కడాయిలో నెయ్యి వేసి కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి. బంగాళదుంప ముక్కలు, పసుపు వేసి మగ్గించాలి. తర్వాత సగ్గుబియ్యం, కొబ్బరి తురుము, పల్లీ పొడి వేయాలి. ఉప్పుతో పాటు కొద్దిగా నీరు చిలకరించాలి. చివర్లో నిమ్మరసం, కొత్తిమీర  కలిపి దించేసి వేడిగా వడ్డించాలి. 

Updated Date - 2020-03-15T17:35:34+05:30 IST