సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2020-10-30T10:26:11+05:30 IST

బ్యాంకు లింకేజీలు లేకుండా నేరుగా అందజేస్తు న్న ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ..

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శం

విద్యాశాఖమంత్రి పి.సబితాఇంద్రారెడ్డి


మహేశ్వరం: బ్యాంకు లింకేజీలు లేకుండా నేరుగా అందజేస్తు న్న ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండలం కొత్వాల్‌చెరువులో జెడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ తీగల అనితారెడ్డితో కలిసి చేపపిల్లలను వదిలిన అనంతరం మహేశ్వరం మండల పరిషత్‌లో కందుకూరు, మహేశ్వరం, మీర్‌పేట మండలాలకు చెందిన 47మంది చిరు వ్యాపారులకు రూ.50వేల చొప్పున రు ణాల మంజూరు మంజూరపత్రాలు, చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం కరోనా మహ మ్మారితో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదు ర్కొన్నా సంక్షేమపథకాల అమలులో వెనకడుగు వేయలేదన్నారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, ఎస్సీ కార్పొరేషన్‌ రు ణాలు యథావిధిగా అందిస్తూ ఆదర్శంగా నిలిచిందన్నారు.


రాష్ట్రంలో లక్షా 40వేల మందికి, జిల్లాలో 334మంది చిరువ్యాపారులకు, 47 మ ంది వితంతువులకు వంద శాతం సబ్సిడీపై ఎస్సీ కార్పొరేషన్‌ రుణా లు పంపిణీ చేశామన్నారు. నిరుద్యోగులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి పారిశ్రామిక వాడల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. రూ.49కోట్లతో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు డ్రైవర్‌ కం ఓనర్‌ స్కీం ద్వారా కార్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవాలనే పేద విద్యార్థులకు రూ.230కోట్ల ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. వ్యవసాయ అనుబం ధ వృత్తులకు, మత్స్యకార్మికులకు వివిధ రకాలుగా ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం శ్రద్ధతీసుకొని రూ.52కోట్లు వెచ్చించి 82కోట్ల చేపపిల్లల వదిలామని పేర్కొన్నారు. జిల్లాలోని చెరువు కుంటల్లో ఇప్పటికే కోటి చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ తీగల అనితారెడ్డి, ఎస్సీకార్పోరేషన్‌ ఈడీ విజయనాయక్‌, తహసీల్దార్‌ ఆర్పీ.జ్యతి, ఎంపీడీవో నర్సింహులు, ఎంపీపీ రఘుమారెడ్డి,వైస్‌ఎంపీపీ సునితఅంద్యానాయక్‌, కందుకూరు ఎపీపీ మందజ్యోతి, జడ్పీటీసీ జంగారెడ్డి, మహేశ్వరం ఏఎంసీ చైర్‌ పర్సన్‌ వరలక్ష్మిసురేందర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌పాండుయాదవ్‌, కెసీ తండా, తుమ్మలూరు సర్పంచ్‌ లు మోతీలాల్‌, మద్దిసురేఖకరుణాకర్‌రెడ్డి, మ హేశ్వరం ఉపసర్పంచ్‌ శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీలు సుదర్శన్‌యాదవ్‌, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T10:26:11+05:30 IST