Apr 22 2021 @ 01:01AM

రావణుడి కోసం శబరి అన్వేషణ

సీతను అపహరించుకు వెళ్లిన రావణుడితో రాముడు యుద్ధం చేశాడు. అంతకు ముందు సీతమ్మ జాడను అన్వేషిస్తూ హనుమంతుడు లంకకు వెళ్లాడు. దహనం చేసి వచ్చాడు. మరి రావణుడి కోసం శ్రీరాముని భక్తురాలు శబరి అన్వేషించడం ఏమిటి? ఈ సంగతి తెలియాలంటే... కన్నడ చిత్రం ‘శబరి - సెర్చింగ్‌ ఫర్‌ రావణ’ విడుదలయ్యే వరకూ వేచి చూడాల్సిందే. కథానాయిక రచితా రామ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. చేతిలో గన్ను పట్టుకుని, పక్కన కుక్కపిల్లను పెట్టుకుని, ఎవరినో హత్య చేసి ఆపై పాదం మోపినట్టు... సింహాసనం మీద ఠీవీగా కూర్చున్న రచితా రామ్‌ లుక్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘‘నేనెంతో ఉత్సాహంగా చేస్తున్న చిత్రమిది’’ అని పేర్కొన్నారామె. అన్నట్టు... చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్‌ ధేవ్‌ హీరోగా నటిస్తున్న ‘సూపర్‌ మచ్చి’ చిత్రంతో రచితా రామ్‌ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.