‘సారు’ ఆశయాలను కొనసాగించాలి

ABN , First Publish Date - 2021-06-22T05:05:44+05:30 IST

ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయాలను కొనసాగించాలని వ్యవసాయశాఖ మం త్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు.

‘సారు’ ఆశయాలను కొనసాగించాలి
జయశంకర్‌ సారు చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, నాయకులు

- వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి

- ప్రొఫెసర్‌ జయశంకర్‌కు ఘన నివాళి

వనపర్తి అర్బన్‌, జూన్‌ 21: ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయాలను కొనసాగించాలని వ్యవసాయశాఖ మం త్రి నిరంజన్‌ రెడ్డి  అన్నారు. సోమవారం పట్టణంలోని  మంత్రి నివాసంలో  జయశంకర్‌ వర్ధంతిని నిర్వహిం చారు. ఈ సందర్భంగా సారు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.   కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయా దవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటీ శ్రీధర్‌, కౌన్సిలర్‌ లక్ష్మీనారా యణ, నాగన్నయాదవ్‌, బండారి కృష్ణ, పట్టణ యువ జన అధ్యక్షుడు సూర్యవంశం గిరి, టీఏఎస్వీ కో ఆర్డినే టర్‌ హేమంత్‌, నాయకులు తిరుమల్‌, ఆవుల రమేష్‌, వినోద్‌కుమార్‌, చిట్యాల రాము పాల్గొన్నారు. అనంత రం 10మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుం చి మంజూరైన ఎల్‌వోసీలను మంత్రి నిరంజన్‌ రెడ్డి అందజేశారు.  ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, మం త్రి నిరంజన్‌రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. 

అమరచింతలో..

  తెలంగాణ రాష్ట్ర సాధనకు నిరంతరం పోరాటం చేసిన  ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయాలను కొనసా గించేందుకు అందరూ కృషి చేయాలని టీఆర్‌ఎస్‌వీ జిల్లా కో ఆర్డినేటర్‌ తోకలి రమేష్‌ పిలుపునిచ్చారు. సోమవారం ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. కార్యక్ర మంలో యూటీఎఫ్‌ జిల్లా నాయకులు శ్రీనివాసులు, కవి వల్లోజు వెంకటచారి, తెలుగు తిరుమలేష్‌లు పాల్గొన్నారు. 

మదనాపురంలో..

  తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఫ్రొఫెసర్‌ జయ శంకర్‌ వర్ధంతిని పురస్కరించుకొని టీఆర్‌ఎస్‌ నాయ కులు నివాళులర్పించారు. మండల కేంద్రంలోని జయ శంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు.  కార్యక్ర మంలో  సర్పంచు రాంనారాయణ, ఎంపీపీ జన్ను పద్మావతి, రవీందర్‌రెడ్డి, వెంకట్‌నారాయణ, చాంద్‌ పాషా, బాలకృష్ణ, వెంకటేష్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:05:44+05:30 IST