ఒలింపిక్స్‌లో భారత్‌ సత్తాచాటాలి

ABN , First Publish Date - 2021-07-24T06:54:54+05:30 IST

ఒలింపిక్స్‌లో భారత్‌ సత్తా చాటాలని, రాష్ట్ర క్రీడాకారులు బ్యాడ్మింటన్‌లో రాణించాలని శాప్‌ వీసీ, ఎండీ ఎస్‌. సత్యనారాయణ, క్రీడాకారులు ఆకాంక్షించారు. టోక్యో విశ్వక్రీడల ప్రారంభోత్సవాన్ని క్రీడాకారులతో కలిసి ప్రత్యక్షప్రసారంలో శుక్రవారం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వీక్షించారు.

ఒలింపిక్స్‌లో భారత్‌ సత్తాచాటాలి

శాప్‌ వీసీ, ఎండీ సత్యనారాయణ

భవానీపురం, జూలై 23 : ఒలింపిక్స్‌లో భారత్‌ సత్తా చాటాలని, రాష్ట్ర క్రీడాకారులు బ్యాడ్మింటన్‌లో రాణించాలని శాప్‌ వీసీ, ఎండీ ఎస్‌. సత్యనారాయణ, క్రీడాకారులు ఆకాంక్షించారు. టోక్యో విశ్వక్రీడల ప్రారంభోత్సవాన్ని క్రీడాకారులతో కలిసి ప్రత్యక్షప్రసారంలో శుక్రవారం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వీక్షించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సారి 127 మంది భారీ టీమ్‌తో భారత్‌ బరిలో దిగుతోందని, రెండంకెల పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. గతేడాది రియో ఒలింపిక్స్‌లో సింధు రజత పతకం సాధించిందని, ఈసారి స్వర్ణపతకం సాధించి తిరిగి రావడం ఖాయమన్నారు. శాప్‌ పరిపాలనాధికారి రామకృష్ణ, ధర్మారావు, జిల్లా చీ్‌ఫ్‌ కోచ్‌ బి.శ్రీనివాసరావు, శాప్‌, టీఏ్‌సఏ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. శాప్‌ కార్యాలయంలో ఎండీ సత్యనారాయణ ఆధ్వర్యంలోను ప్రత్యక్షంగా వీక్షించిన అధికారులు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2021-07-24T06:54:54+05:30 IST