Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 16 Aug 2022 18:38:49 IST

Saakini Daakini: థ్రిల్‌ చేయడానికి నివేదా–రెజీనా రెడీ!

twitter-iconwatsapp-iconfb-icon

సౌత్‌ కొరియా యాక్షన్‌–కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘శాకిని డాకిని’.(Saakini Daakini)  రెజీనా(Regina ), నివేదా థామస్‌(Nivetha thomas) కీలక పాత్రధారులు. సుధీర్‌ వర్మ (Sudheer varma) దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, గురు ఫిలిమ్స్‌, క్రాస్‌ పిక్చర్స్‌ బ్యానర్స్‌పై డి.సురేశ్‌బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్‌ కిమ్‌ నిర్మిస్తున్నారు.  సెప్టెంబర్‌ 16న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రం ఈ విషయాన్ని కొత్త పోస్టర్‌ విడుదల చేసి తెలిపారు. రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌లో డేర్‌డెవిల్‌ లేడీస్‌ రెజీనా, నివేద సీరియస్‌ లుక్‌లో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. 

‘‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ గ్లోబల్‌ అపీల్‌ ఉన్న కథ. ఇందులో ప్రతి సన్నివేశం తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుంది. చిత్రీకరణ చివరి దశలో ఉంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌ 16న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. రిచర్డ్‌ ప్రసాద్‌ కెమెరా పనితనం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని నిర్మాతలు తెలిపారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, సంగీతం: మైకీ మెక్‌క్లియరీ, నరేష్ కుమారన్, ఎడిటర్: విప్లవ్ నైషధం, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్: అక్షయ్ పూల్లా, ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్



Saakini Daakini: థ్రిల్‌ చేయడానికి నివేదా–రెజీనా రెడీ!


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement