Abn logo
Mar 2 2021 @ 21:27PM

అత్తింటిలో సాహూ డైరెక్టరు సందడి

రాపూరు, మార్చి 2: సాహూ సినిమా  డైరెక్టరు సుజీత్‌రెడ్డి రాపూరులో మంగళవారం సందడి చేశారు. వేపినాపికి చెందిన పాపకన్ను ప్రభాకర్‌రెడ్డి కుమార్తెను ఇటీవల సుజీత్‌రెడ్డి వివాహం చేసుకున్నారు. అత్తగారిల్లు వేపినాపి కావడంతో ఇక్కడకు చేరుకున్నారు. పాపకన్ను కుటుంబ ఇలవేల్పు పోతుకొండ అంకమ్మను భార్య, కుటుంబసభ్యులు, బంఽధువులతో కలసి దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆశ్వీరదించి తీర్థప్రసాదాలు అందించారు. అమ్మవారికి  కొత్త దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. 


Advertisement
Advertisement
Advertisement