Abn logo
Apr 10 2020 @ 09:32AM

రూ.20 కోట్ల‌కు ‘సాహో’ శాటిలైట్..?

ప్ర‌భాస్ హీరోగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన చిత్రం ‘సాహో’. గ‌త ఏడాది ఈ చిత్రం విడుద‌లైంది. అప్ప‌టికే ప్ర‌భాస్ ‘బాహుబ‌లి’ స‌క్సెస్ వ‌ల్ల వ‌చ్చిన‌ పాన్ ఇండియా హీరో ఇమేజ్‌తో ‘సాహో’ డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ ఓ మోస్త‌రు క‌లెక్ష‌న్స్‌నే రాబ‌ట్టుకుంది. ఈ సినిమా థియేట్రిక‌ల్‌, డిజిట‌ల్‌ హ‌క్కులకు అప్ప‌ట్లో గ‌ట్టి డిమాండే వ‌చ్చింది. అయితే ‘సాహో’ శాటిలైట్ హ‌క్కులు మాత్రం హోల్డ్‌లో ప‌డ్డాయ‌ట‌. అయితే రెండు వారాల క్రితం ఓ ప్ర‌ముఖ ఛానెల్ రూ.20 కోట్ల‌కు తెలుగు స‌హా ఇత‌ర రీజ‌న‌ల్ లాంగ్వేజెస్ శాటిలైట్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 20వ సినిమా చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement