Abn logo

సాబుదానా కబాబ్‌

కావలసినవి: బంగాళదుంపలు - నాలుగు, సాబుదానా - ఒక కప్పు, పల్లీల పొడి - ఐదు టేబుల్‌స్పూన్లు, పెరుగు - రెండు టీస్పూన్లు, ఎండుమిర్చి - నాలుగైదు, ఉప్పు - తగినంత, నెయ్యి - సరిపడా, కొత్తిమీర - కొద్దిగా, రాజ్గిరా పిండి - రెండు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం: సాబుదానా నానబెట్టుకోవాలి. బంగాళదుంపలను ఉడికించి, మెత్తటి గుజ్జుగా చేసుకోవాలి. పల్లీలను వేగించి పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో ఉడికించిన బంగాళదుంపలు, నానబెట్టిన సాబుదాన వేసి కలపాలి. తరువాత అందులో పల్లీల పొడి, పెరుగు, దంచిన ఎండుమిర్చి, కొత్తిమీర, రాజ్గిరా పిండి, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని చువ్వలకు గుచ్చి గ్రిల్‌పై కాల్చాలి. కొద్దికొద్దిగా నెయ్యి అద్దుకుంటూ గోధుమ రంగులోకి మారే వరకు కాల్చాలి. చట్నీతో తింటే సాబుదానా కబాబ్స్‌ ఎంతో రుచిగా ఉంటాయి.

మిక్స్‌డ్‌ మిల్లెట్‌ భేల్‌ పూరిరాగి కుకీస్‌బ్రొకోలి పనీర్‌ పీనట్‌ శాండ్‌విచ్‌కబాబ్స్‌భాంగ్‌ పకోడిఓట్స్‌ ఇడ్లీఆపంమూంగ్‌ దాల్‌ ఛాట్‌పోహా కట్‌లెట్స్‌రైస్‌ బాల్స్‌
Advertisement
Advertisement