MPP Resign: ఎమ్మెల్యే ఇబ్బందులకు తట్టుకోలేక ఎస్‌.రాయవరం ఎంపీపీ రాజీనామా

ABN , First Publish Date - 2022-09-23T17:49:11+05:30 IST

జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం ఎంపీపీ శారదాకుమారి తన పదవికి రాజీనామా చేశారు.

MPP Resign: ఎమ్మెల్యే ఇబ్బందులకు తట్టుకోలేక ఎస్‌.రాయవరం ఎంపీపీ రాజీనామా

అనకాపల్లి: జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం ఎంపీపీ శారదాకుమారి తన పదవికి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఇబ్బందులకు తట్టుకోలేక రాజీనామా చేస్తున్నట్టు శారదాకుమారి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే ఇద్దరు సర్పంచులపై ఎమ్మెల్యే వేటు వేయడంపై తీవ్ర మనస్థాపం చెందానట్లు తెలిపారు. తన 22 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంతగా బాధపడలేదన్నారు. వైసీపీలో సీఎం, మంత్రులు, స్థానిక కార్యకర్తలు, ప్రజలు తనను సోదరిగా ఆదరించారని అన్నారు.‘‘నేను రాజీనామా చేస్తున్నందుకు క్షమించండి’’ అంటూ శారదా కుమారి అన్నారు. 

Updated Date - 2022-09-23T17:49:11+05:30 IST