కరోనా భయంతో.. కరెన్సీని వాషింగ్ మెషిన్‌లో ఉతికిపారేశాడు! చివరికి..

ABN , First Publish Date - 2020-08-03T14:53:01+05:30 IST

రోనా పేరు చెబితేనే ప్రజలు భయపడిపోతున్నారు. దాని పాల పడకుండా ఉండేందుకు ఏంచేయాడానికైనా వెనకాడట్లేదు. ఇలాంటి స్థితిలోనే ఉన్న ఓ వ్యక్తి ఏకంగా డబ్బు కట్టలను వాషింగ్ మెషిలో వేసి ఉతికేశాడు.

కరోనా భయంతో.. కరెన్సీని వాషింగ్ మెషిన్‌లో ఉతికిపారేశాడు! చివరికి..

సియోల్: కరోనా పేరు చెబితేనే ప్రజలు భయపడిపోతున్నారు. దాని పాల పడకుండా ఉండేందుకు ఏంచేయాడానికైనా వెనకాడట్లేదు. ఇలాంటి స్థితిలోనే ఉన్న ఓ వ్యక్తి ఏకంగా డబ్బు కట్టలను వాషింగ్ మెషిలో వేసి ఉతికేశాడు. కరెన్సీ కాగితాలన్నీ పిప్పి పిప్పి అయిపోవడంతో లబోదిబోమంటూ కేంద్ర బ్యాంకును సంప్రదించాడు. ఈ ఘటన దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది. సదరు బాధితుడు 50 వేల వాన్‌ల నోట్లను వాషింగ్ మేషిన్‌లో వేసి శుభ్రం చేసేశాడు. ఆ తరువాత వాటిని బయటకి తీసి చూశాక గానీ..చేసిన తప్పు అతడికి అర్థం కాలేదు.


కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. దీంతో అతడు వెంటనే దక్షిణ కొరియా కేంద్ర బ్యాంకును సంప్రదించాడు. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను ఇవ్వడం కుదురుతుందా అని అడిగాడు. అయతే నిబంధనల ప్రకారం.. పాత, చిరిగిపోయిన కరెన్సీ స్థానంలో కొత్త వాటిని పొందే అవకాశం ఉంది. అయితే పూర్తిగా పాడైన నోట్లను కేంద్ర బ్యాంకు కూడా తిరస్కరిస్తుంది. ఈ నేపథ్యంలో సదరు బాధితుడు కేవలం దాదాపు 19 వేల డాలర్ల విలువైన మొత్తాన్ని మాత్రమే తిరిగిపొందగలిగాడు.


ఓదార్పు కోసమే ఈ మొత్తం ఇచ్చామని, అతడికి భారీగా నష్టం జరిగిందని ఈ సందర్భంగా అధికారులు వ్యాఖ్యానించారు. బాధితుడిపేరు ఈయాన్ అని వెల్లడించడం మినహా అతడి ఇతర వివరాలేవీ అధికారులు వెల్లడించలేదు. కాగా.. గతంలో కిమ్ అనే మరో వ్యక్తి నోట్లను మైక్రోవేవ్ ఓవన్‌లో వేసి శానిటైజ్ చేశాడు. ఈ సందర్భంగా కొన్ని నోట్లు కాలిపోయాయి. మార్పిడికి అర్హమైన నోట్లను అతడు కూడా కేంద్రం బ్యాంకు వద్ద ఎక్సేంజ్ చేసుకున్నాడు. అయితే ఈ ఘటనలో అతడికి పెద్ద నష్టమేమీ రాలేదని సమాచారం. 

Updated Date - 2020-08-03T14:53:01+05:30 IST