బహ్రెయిన్‌లో 200 ఏళ్ళనాటి హిందూ దేవాలయంలో జైశంకర్ పూజలు

ABN , First Publish Date - 2020-11-25T19:16:33+05:30 IST

భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ బుధవారం

బహ్రెయిన్‌లో 200 ఏళ్ళనాటి హిందూ దేవాలయంలో జైశంకర్ పూజలు

మనామా : భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ బుధవారం బహ్రెయిన్‌లోని శ్రీనాథ్‌జీ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇది 200 ఏళ్ళనాటిది కావడం విశేషం. ఈ వివరాలను జై శంకర్ ఓ ట్వీట్‌లో తెలిపారు. బహ్రెయిన్-భారత్ మధ్య సన్నిహిత సంబంధాలకు ఈ దేవాలయం ప్రతీక అని పేర్కొన్నారు. 


‘‘మనామాలోని 200 ఏళ్ళనాటి శ్రీనాథ్‌జీ దేవాలయంలో దర్శనంతో ఈ రోజును ప్రారంభించాను. బహ్రెయిన్‌తో మన దేశానికిగల కాల పరీక్షకు నిలిచిన, సన్నిహిత సంబంధాలకు ఈ దేవాలయం సాక్ష్యం’’ అని తెలిపారు. 


జై శంకర్ రెండు రోజుల బహ్రెయిన్ పర్యటన మంగళవారం ప్రారంభమైంది. మంగళవారం ఆయన బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీతో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు, వివిధ రంగాల్లో సంబంధాలపై చర్చలు జరిపారు. 


Updated Date - 2020-11-25T19:16:33+05:30 IST