రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి

ABN , First Publish Date - 2021-01-14T05:17:53+05:30 IST

ప్రభుత్వాలు చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని బుధ వారం తెల్లవారుజామున రైతు వ్యతిరేక జీవో ప్ర తులను టీడీపీ నాయకులు భోగి మంటల్లో వేసి ని రసన తెలిపారు.

రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
భోగి మంటల్లో ప్రతులను తగులబెట్టిన టీడీపీ, ప్రజా సంఘాల నాయకులు



కనిగిరి, జనవరి 13 : ప్రభుత్వాలు చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని బుధ వారం తెల్లవారుజామున రైతు వ్యతిరేక జీవో ప్ర తులను టీడీపీ నాయకులు భోగి మంటల్లో వేసి ని రసన తెలిపారు. టీడీపీ ఇన్‌చార్జి, తిరుపతి, చి త్తూరు పార్లమెంటరీ కోఆర్డినేటర్‌  డాక్టర్‌ ఉగ్ర నర సింహారెడ్డి ఆదేశాలతో జరిగిన  కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు దొడ్డా వెంకట సుబ్బా రెడ్డి, రాచమల్ల శ్రీనివాసులరెడ్డిలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుం చి రైతు ఆత్మహత్యలు పెరిగి పోయాయని ఆరో పించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కార ణంగా రైతులు నానా ఇబ్బందులెదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పండుగల రోజుల్లో కూడా రైతులు సంతోషంగా లేరని, భోగి మంటలు వెలగాల్సిన లోగిళ్లలో అన్నదాతల గుండె మంటలు చెలరేగుతు న్నాయని విమర్శించారు. వరస విపత్తుల్లో రైతులు పూర్తిగా నష్టపోయారని, భారీ వర్షాలకు తడిసి రంగుమారిన ధాన్యం కొనేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు ఇష్టారాజ్యంగా రైతులను మోసం చేస్తున్నారని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న సీఎం జగన్‌ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. తుఫాన్‌ వలన నష్టపోయిన రైతులను ఆదుకుం టామని చెప్పిన సీఎం పరిహారం ఇస్తున్నట్లు ప్రక టించి బటన్‌ నొక్కి నష్టపరిహారం అందకుండా చేసి రైతులను అపహాస్యం చేశారని దుయ్య బట్టారు. కార్యక్రమంలో  హెచ్‌ఎంపాడు మండల పార్టీ అధ్యక్షుడు గాయం తిరుపతిరెడ్డి,  గండికోట రమేష్‌, టౌన్‌ పార్టీ తెలుగు యువత అధ్యక్షుడు షేక్‌ ఫిరోజ్‌, బ్రహ్మం గౌడ్‌, లక్ష్మయ్య, గౌస్‌, ఫరూక్‌, జిలానీ, చిలకపాటి బ్రహ్మం, ఎస్తానీ బాషా, కోటా సురేష్‌, ముండ్లమూరి శ్రీను పాల్గొన్నారు. 

పామూరులో..

పామూరు :  వ్యవసాయ చట్టాలను రద్దు చే యాలని పశ్చిమ ప్రకాశం సీపీఎం కార్యదర్శి ఎస్‌డీ హనీఫ్‌ డిమాండ్‌ చేశారు. ఆ ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.  కాగా మండ లంలోని పలు గ్రామాల్లో సిపిఎం శ్రేణులు భోగి సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 

మార్కాపురంలో..

మార్కాపురం (వన్‌టౌన్‌) : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన సాగు చట్టాలను రద్దు చే యాలని డిమాండ్‌ చేస్తూ వ్యవసాయ కార్మిక సం ఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. మండలంలోని వేములకోట, నాగు ల వరం, బోడపాడుల్లో ఆ చట్టాల ప్రతులను దహ నం చేశారు. సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు డి.సోమ య్య,  నాయకులు ఏడుకొండలు, సుబ్బయ్య, శ్రీనివాసులు, సుబ్బారెడ్డి, నాగయ్య  పా ల్గొన్నారు.

పన్నుల పెంపు జీవో కాపీల దహనం

మార్కాపురం : మున్సిపాలిటీల్లో పన్నుల పెంపు ను నిరసిస్తూ పౌరసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం భోగి మంటల్లో జీవో కాపీలను దహ నం చేశారు. స్థానిక రాజాజీవీధిలో నిర్వహించిన  కార్యక్రమంలో సమాఖ్య నాయకులు రఫి, కృష్ణశాస్త్రి మాట్లాడుతూ పట్టణాల్లో ఆస్తి, నీటి, డ్రైనేజీ ప న్నులను పెంచుతూ ప్రభుత్రం ప్రజలపై మోయ లేని భారాలు మోపుతున్నదని విమర్శించారు. ఈ జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశా రు. షేక్‌ రజాక్‌, సుబ్బరాయుడు, రాజు, గఫూర్‌ తదితరులు పాల్గొన్నారు. 

దర్శిలో..

దర్శి : వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని జారీ చేసిన జీవో ప్రతులను టీడీపీ లీగల్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు పరిటాల సురేష్‌ భోగి మంటల్లో తగులబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు తీరని నష్టం కల్గించే ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అశోక్‌యాదవ్‌, కోటయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ముండ్లమూరులో..

ముండ్లమూరు :  మండల రైతుసంఘం ఆధ్వర్యంలో బుధవారం భోగిమంటల్లో నూతన వ్యవసాయ బిల్లుల ప్రతులను తగులబెట్టి నిరసన తెలిపారు. మండలంలోని వేంపాడు, శంకరాపురం, వేముల, మారెళ్ల, జమ్మలమడక, బొప్పూడివారిపాలెం గ్రామాల్లో బిల్లుల ప్రతులను తగులబెట్టారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ కార్మికసంఘం నాయకులు పంటా ఏడుకొండలు, వెల్లంపల్లి ఆంజనేయులు, బోడపాటి హనుమంతరావు, తోటా తిరుపతయ్య తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-01-14T05:17:53+05:30 IST