దగ్గరగా కూరగాయలు

ABN , First Publish Date - 2020-03-29T09:41:51+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కూరగాయల కొనుగోళ్లకు ప్రజలు మూకుమ్మడిగా వస్తుండడంతో రైతు బజార్ల వికేంద్రీకరణకు ప్రభుత్వం సత్వర చర్యలు...

దగ్గరగా కూరగాయలు

  • తాత్కాలిక రైతుబజార్లు, మొబైల్‌ దుకాణాలు ఏర్పాటు


అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో కూరగాయల కొనుగోళ్లకు ప్రజలు మూకుమ్మడిగా వస్తుండడంతో రైతు బజార్ల వికేంద్రీకరణకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 142 రైతుబజార్లకు అదనంగా వివిధ నగరాల్లో కొత్తగా 100 తాత్కాలిక రైతు బజార్లు ఏర్పాటు చేశారు. వివిధ పట్టణాల్లోని 145 కూడళ్లలో కూరగాయ మార్కెట్లు ఏర్పాటు చేశారు. ఇందులో నెల్లూరు జిల్లాలో 98, ప్రకాశం జిల్లాలో40, అనంతపురంలో 7 ఉన్నాయి. విశాఖ, విజయవాడ, కాకినాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో 101 మొబైల్‌ కూరగాయల వాహనాలతో అమ్మకం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా  రైతుబజార్ల ద్వారా శనివారం 25 వేల క్వింటాళ్ల కూరగాయలు అమ్ముడుపోయినట్లు రైతుబజార్ల సీఈవో అహ్మద్‌ తెలిపారు. 

Updated Date - 2020-03-29T09:41:51+05:30 IST