చెరువు తవ్వకాన్ని నిరసిస్తూ రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2021-06-24T07:01:29+05:30 IST

అక్రమ చేపల చెరువుల తవ్వకాన్ని నిరసిస్తూ బుధవారం రైతులు స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

చెరువు తవ్వకాన్ని నిరసిస్తూ రైతుల ఆందోళన

ముదినేపల్లి రూరల్‌, జూన్‌ 23 : అక్రమ చేపల చెరువుల తవ్వకాన్ని నిరసిస్తూ బుధవారం రైతులు స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.  స్తంభంచెరువుకు చెందిన రైతులు తమ పంట పొలాల మధ్య చేపల చెరువు లకు అనుమతులు పొంది రొయ్యల చెరువు సాగుకు ప్రయత్నం చేస్తున్నారని, ఉప్పునీటి బోర్లు వేస్తే పొలాలు బీడు భూములుగా మారటమే కాకుండా చౌడు బారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.  తహసీల్దార్‌ శ్రీనివాస్‌ను కలసి పొలాల మధ్య చెరువు తవ్వకానికి అనుమతి ఎలా ఇచ్చారంటూ రైతులు నిలదీశారు.   తహసీల్దార్‌కు రైతులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎనిమిది ఎకరాలకు అనుమతి ఇచ్చామని,  ఐదు ఎకరాలు అనుమతి లేకుండా తవ్వితే తవ్వకాన్ని నిలిపి వేస్తామని తహసీల్దార్‌ వివరించినా రైతులు శాంతించలేదు.  

Updated Date - 2021-06-24T07:01:29+05:30 IST