రైతులకు మద్దతు ధర కల్పించమంటే అరెస్టులా!

ABN , First Publish Date - 2021-05-16T06:44:52+05:30 IST

రబీలో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించమంటే అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

రైతులకు మద్దతు ధర కల్పించమంటే అరెస్టులా!

అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

బిక్కవోలు, మే 15: రబీలో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించమంటే అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని అనపర్తి మాజీ ఎమ్మెల్యే   నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అపర భగీరుథుడు కాటన్‌ జయంతి సందర్భంగా శనివారం కొంకుదురులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిర్పించారు. అనం తరం ఐదుగురు టీడీపీ నేతలతో కలిసి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ శాంతియుతంగా దీక్ష చేపట్టారు. బిక్కవోలు ఎస్‌ఐ పి.వాసు సిబ్బందితో వెళ్లి కొవిడ్‌ నిబంధనలు, 144 అమలులో వుండగా దీక్షలు చేపట్టరాదంటూ రామకృష్ణారెడ్డితో పాటు దీక్షలో కూర్చున్నవారిని బిక్కవోలు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి కేసులు నమోదు చేశారు. కొద్దిసేపటి తర ్వాత స్టేషన్‌ బెయిల్‌పై వారిని విడిచిపెట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం రూ.1,400 మద్దతు ధర ప్రకటిస్తే దళారులు, మిల్లర్లు కలిసి రూ.800 నుంచి రూ.1,100 వరకు కొనుగోలు చేశారని, దీంతో గోదావరి డెల్టా రైతులు రూ.1,500 కోట్లు నష్టపోయారన్నారు. ఈ విధంగా కొనుగోలు చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టి, రైతులు నష్టపోయిన సొ మ్ము వారికి చెందాలన్నదే తమ పార్టీ విధానమన్నారు. ఇందుకోసం శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు భగ్నం చేసి కేసులు పెట్టడం సరికాదన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా రైతులకు న్యాయం జరిగే     వరకు పోరాటం చేస్తానన్నారు. దీక్షలో తెలుగు రైతు అధ్యక్షుడు అచ్చిరెడ్డి, టీడీపీ బిక్కవోలు మండల శాఖ అధ్యక్షుడు కొవ్వూరి వేణుగోపాలరెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ చింతా శ్రీనివాసరెడ్డి, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట నేతలు సుబ్బారెడ్డి, వెంకటరామారెడ్డి, రాయుడు రామచంద్రరావు, పడాల ఆదినారాయణరెడ్డి, పాలచర్ల శివప్రసాద్‌చౌదరి, జంపా వెంకటరమణ, తనుకు శ్రీధర్‌, తాతారెడ్డి, వీరభద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-16T06:44:52+05:30 IST