రైతుభరోసా అర్హుల జాబితా ప్రదర్శన

ABN , First Publish Date - 2021-04-13T06:24:42+05:30 IST

రైతుభరోసా అర్హుల జాబితా ప్రదర్శన

రైతుభరోసా అర్హుల జాబితా ప్రదర్శన
ఇందుపల్లి ఆర్బీకెలో జాబితా ప్రదర్శిస్తున్న ఏవో హెప్సిబారాణి

ఉంగుటూరు, ఏప్రిల్‌ 12 :  రైతుభరోసాకు అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని రైతులు  తగిన ధ్రువపత్రాలతో ఈనెల 30వ తేదీలోపు మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో సంప్రదించాలని మండల వ్యవసాయాధికారి కె.హెప్సిబారాణి అన్నారు. సోమవారం మండలంలోని అన్ని ఆర్బీకేలలో ఈఏడాది రైతుభరోసాకు అర్హులైన  లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించారు. ఇందుపల్లి ఆర్బీకెలో జాబితాను ప్రదర్శించిన ఏవో మాట్లాడుతూ కొత్తపాస్‌బుక్‌లు పొందినవారు. నామినీలు, గతేడాది రైతుభరోసా రానివారు రైతుభరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నారు. ఈక్రాప్‌లో నమోదైన ప్రతిరైతు తమ గ్రామంలోని ఆర్బీకేల్లో వేలిముద్ర వేయాలని, అలాగే దాళ్వా వేసిన ప్రతి రైతు తమ పంటను విక్రయించేందుకు ఆర్బీకేల్లో తప్పనిసరిగా రిజిస్టర్‌ కావాలని సూచించారు.

రైతుభరోసాపై రైతులకు అవగాహన

ఈ ఏడాది వైఎస్సార్‌ రైతుభరోసాకు అర్హత కలిగిన ప్రతి రైతు దరఖాస్తు చేసుకోవాలని ఏఈవో బి.దుర్గానాగేశ్వరరావు అన్నారు. నాగవరప్పాడు సచివాలయంలో సోమవారం రైతుభరోసాపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది రైతుభరోసా కింద డబ్బులు పడిన రైతులకు ఈ ఏడాది జాబితాల్లో పేర్లు వున్నాయని, మిగిలిన రైతులు సంబంధిత పత్రాలతో గ్రామాల్లోని వీఏఏలను ఈనెల 30వ తేదీలోగా సంప్రదించాలని ఏఈవో సూచించారు. 

Updated Date - 2021-04-13T06:24:42+05:30 IST