2,39,926 మందికి రైతుబంధు

ABN , First Publish Date - 2021-06-15T05:25:02+05:30 IST

2,39,926 మందికి రైతుబంధు

2,39,926 మందికి రైతుబంధు

  • 14,972 మంది కొత్త రైతులకూ పెట్టుబడి సాయం వర్తింపు
  • వికారాబాద్‌ జిల్లాకు రూ.311.69కోట్లు కేటాయింపు
  • నేటి నుంచి దశల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి): పంటల సాగుకు పెట్టుబడి సాయంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద ప్రతీ ఎకరానికి రూ.5వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ చేస్తోంది. రైతుబంధు కింద వికారాబాద్‌ జిల్లాలో 2,39,926 మంది రైతులకు రూ.311.69కోట్ల పెట్టుబడి సాయం నేటి నుంచి ఇవ్వనున్నారు. గత వానాకాలం సీజన్‌లో జిల్లాలో 2,24,954 మంది రైతులకు రైతుబంధు కింద రూ.307.63కోట్లు కేటాయించగా, 2,10,962 మంది రైతులు రూ. 294.70కోట్లు పొం దారు. మిగతా రైతులు వివిధ కారణాలతో రైతుబంధు పొందలేదు. కొందరు రైతులు రైతుబ ంధును స్వచ్ఛం దంగా వదులుకోగా, కొందరు రైతులు రెవెన్యూ సమస్యలు, బ్యాంకు ఖాతాల వివరాలు అందజేయని కారణంగా డబ్బు పొందలేదు. గత వానాకాలంలో వివిధ కారణాలతో రైతుబంధు పొందని 13,991 మంది రైతుల రూ.12.93కోట్లు తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. రైతుబంధు పథకానికి అ ర్హులైన రైతులందరి వివరాలను సీసీఎల్‌ఏ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు అందజేసింది. ఈ నెల 10వ తేదీ వరకు పట్టాదారు పాసు పుస్తకం పొ ంది సీసీఎల్‌ఏ ద్వారా ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి అధికారులు రైతుబంధు డబ్బు ను బదిలీ చేయనున్నారు.


  • కొత్తగా 14,972 మందికి రైతుబంధు


గత ఏడాది వానాకాలం పెట్టుబడి సాయం పొందిన రైతులతో పోలిస్తే ఈ ఏడాది అదన ంగా 28,963 మంది రైతులను రైతుబంధుకు ఎంపిక చేశారు. వీరిలో గత ఏడాది ఎంపికైనా రైతుబంధు పొందని వారు 13,991 మంది ఉన్నారు. వీరికి అదనంగా ఈ సారి కొత్తగా మరో 14,972 మంది రైతులకు పెట్టుబడి సాయం అందజేయనున్నారు. గత ఏడాది రైతులకు రూ.294.70కోట్ల పెట్టుబడి సాయం అందించగా, ఈ సారి అదనంగా మరో రూ.16.99కోట్లు అందించనున్నారు. జిల్లాలోని వ్యవసాయ భూముల్లో ఎలాంటి వివాదాలు, సమస్యల్లేని భూములను పార్ట్‌-ఎలో చేర్చారు. ఈ రైతులకు ఇప్పటికే పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. సమస్యలు, సమస్యాత్మక భూములను పార్ట్‌-బిలో చేర్చారు. ఈ భూములపై ఉన్న వివాదాలు పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. వీటిల్లో ఇప్పటికే చాలా వరకు సమస్యలు పరిష్కరించగా, ఇంకా కొన్ని భూవివాదాలు పరిష్కారం కావాల్సి ఉంది. పరిష్కారమైన కేసుల్లో సదరు రైతులకు రైతుబంఽధ అందజేస్తున్నారు. తొలిసారి పట్టాపాసు పుస్తకాలు పొందిన రైతులందరి బ్యాంకు ఖాతా, ఆధార్‌ వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరించారు. వారందరికీ ఈ సారి పెట్టుబడి సాయం అందనుంది.


  • నేడు ఎకరాలోపు రైతులకు రైతుబంధు జమ ...


ఇదిలా ఉంటే, రైతుబంధు సాయం దశల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. మొదట ఎకరాలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బు జమకానున్నాయి. రైతుల ఖాతాల్లో రైతుబంధు జమచేసే ప్రక్రియకు మంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. తొలి రోజు ఎకరా భూమి ఉన్న రైతులకు సాయం అందనుండగా, ఆ తరువాత ఐదెకరాలలోపు రైతులకు, అనంతరం పదెకరాల్లోపు వారికి రైతుబంధు డబ్బు బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఈ నెల 25వ తేదీలోగా పోర్టల్‌లో నమోదైన రైతులందరి ఖాతాల్లో డబ్బు జమచేస్తారు.

Updated Date - 2021-06-15T05:25:02+05:30 IST