రైతులందరికీ ‘రైతుబంధు’ అందాలి: కేసీఆర్

ABN , First Publish Date - 2020-07-12T01:04:08+05:30 IST

రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులందరికీ ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్, అధికారులను ఆదేశించారు.

రైతులందరికీ ‘రైతుబంధు’ అందాలి: కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులందరికీ ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్, అధికారులను ఆదేశించారు. రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వందకు వందశాతం నియంత్రిత పద్ధతిలో ఈ వానాకాలం పంట సాగు చేస్తుండడం శుభసూచకమన్నారు. ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది అని సీఎం వ్యాఖ్యానించారు. సీడ్‌ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు రూ.25 కోట్ల వ్యయంతో అతి పెద్ద అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజి నిర్మించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు.  

Updated Date - 2020-07-12T01:04:08+05:30 IST