రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-06T05:49:07+05:30 IST

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం సాగిస్తామని వామపక్ష నాయకులతో పాటు కాంగ్రెస్‌ నాయకులు స్పష్టం చేశారు.

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి
ఫైర్‌స్టేషన్‌ సర్కిల్‌లో ధర్నా చేస్తున్న వామపక్ష, కాంగ్రెస్‌ నాయకులు

ఏలూరు కార్పొరేషన్‌, డిసెంబరు 5 : రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం సాగిస్తామని వామపక్ష నాయకులతో పాటు కాంగ్రెస్‌ నాయకులు స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందో ళనకు మద్దతుగా వామ పక్షాలు, కాంగ్రెస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో ఆందోళన, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భం గా సీపీఎం ఏలూరు నగర కార్యదర్శి బి.కిషోర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బి.సోమయ్య, సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు, ఎంసీపీఐ(యూ) జిల్లా కార్య దర్శి ఎస్‌.నాగ రాజు, సీపీఐ నాయకులు అమానుద్దీన్‌, కాంగ్రెస్‌ ఏలూరు నగర ఇన్‌చార్జి కె.రాజనాల రామ్మోహన్‌రావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం నూత న వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఆం దోళన చేస్తున్నారన్నారు. కాని కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంద న్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక వ్యవ సాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  సీపీఎం జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు ప్రసాద్‌, నగర కమిటీ సభ్యులు బి.జగన్నాఽథరావు, వి.సాయి బాబు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు బద్దా వెంకట్రావు, కాకర్ల అప్పారావు, కోరాడ అప్పారావు, గురుమూర్తి, శివ, సత్యనారాయణ, సీపీఐ నాయకులు కరీం, కాంగ్రెస్‌ నాయకులు రమాదేవి, చంద్రకాంతం, సేవాదళ్‌ సుబ్బారావు, మిద్దే వెంకట్రావు, రంగబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T05:49:07+05:30 IST