నీరుగార్చే కుట్ర..!

ABN , First Publish Date - 2022-05-29T06:12:07+05:30 IST

నీరుగార్చే కుట్ర..!

నీరుగార్చే కుట్ర..!

ఆర్‌డబ్ల్యూఎస్‌ అవినీతిలో సాక్ష్యాలు లేవట..!

ఫీల్డ్‌ ఎంక్వయిరీని మమ.. అనిపించారు

అవినీతిపరులను కాపాడేందుకు ఉన్నతాధికారుల డ్రామా

‘ఆంధ్రజ్యోతి’ వద్ద ఉన్న సాక్ష్యాలివిగో..

సమాచార హక్కు చట్టం చెప్పినవే..


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రక్షిత మంచినీటి పథకాల్లోని పైపులైన్ల పనుల్లో జరిగిన అవినీతిని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది. ఈ వ్యవహారాన్ని మరుగునపరచాలని కంకణం కట్టుకున్న గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) ఉన్నతాధికారులు బాధ్యులైన అధికారులను కాపాడేందుకు సాక్ష్యాలు లేవన్న వాదనను తెరపైకి తెచ్చారు. ఫీల్డ్‌ ఎంక్వయిరీలో గోతులు తవ్వి పరిశీలించకుండా మమ.. అనిపించేసి, పనుల బండారాన్ని బయటకు రాకుండా చేశారు. వాస్తవానికి ఫీల్డ్‌ ఎంక్వయిరీలోనే దొంగలు అడ్డంగా దొరికిపోయేవారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటే, డిస్ర్టిక్ట్‌ సపోర్టు యూనిట్‌ (డీఎస్‌యూ) పనుల్లో అంతా కలిసి చేసిన అవినీతి బయట పెడతారేమోనని ఉన్నతాధికారులు భయపడ్డారు. ఈ కారణంతోనే బాధ్యులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా జరిగిన రక్షిత మంచినీటి పైపులైన్ల పనులకు సంబంధించిన అక్రమాల తాలూకా సాక్ష్యాలు ఇప్పటికే బహిర్గతమయ్యాయి. ఇవన్నీ సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు వెలుగుచూసినవే. ఈ సాక్ష్యాలు అధికార యంత్రాంగం ధ్రువీకరించనవి కూడా. 

విచారణ ఎందుకు చేసినట్టు?

ఒక పనిలో తప్పు చేశారా, లేదా అనేది తెలుసుకోవడం తేలికే. ఆ పనికి సంబంధించిన ఎస్టిమేట్స్‌ వివరాలను, టెక్నికల్‌ శాంక్షన్లను పరిశీలించాలి. వీటికనుగుణంగా క్షేత్రస్థాయిలో అదే ప్రమాణాలతో కూడిన మెటీరియల్‌తో నిర్దేశించిన కొలతల ప్రకారం చేపట్టారా, లేదా తెలుసుకోవాలి. ఎంబుక్‌లలో నమోదుచేసిన వివరాలు ఒకటిగా ఉన్నాయా, లేదా చూడాలి. చివరగా సీఎఫ్‌ఎంఎస్‌లో ఎక్కించిన వివరాలను పరిశీలించాలి. జీఎస్టీ చెల్లింపులు జరిగాయో లేదో తెలుసుకోవాలి. వర్క్‌ ఎస్టిమేట్లు, టెక్నికల్‌ శాంక్షన్లకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పనులు జరిగితే, వాటికి అనుగుణంగానే పనులు జరిగినట్టుగా ఎంబుక్‌లలో నమోదు చేశారు. ఇవి ఉన్నతాధికారుల వద్దే ఉంటాయి. కానీ, వాటిని పరిశీలించలేదు. ఎంబుక్‌లను కొందరు ట్యాంపరింగ్‌ కూడా చేశారు. ఈ విషయాన్నీ నీరుగార్చేశారు.




Updated Date - 2022-05-29T06:12:07+05:30 IST