రివోల్ట్‌ నుంచి తక్కువ ధరలో ఆర్‌వీ 1

ABN , First Publish Date - 2021-07-26T07:21:15+05:30 IST

రతన్‌ ఇండియా పెట్టుబడులున్న రివోల్ట్‌ మోటార్‌ తక్కువ ధరలో ఆర్‌వీ 1 ఎలక్ట్రిక్‌ బైక్‌ను త్వర లో మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రస్తుతం ఆ సంస్థ కు చెందిన ఆర్‌వీ 400, ఆర్‌వీ 300 మోడళ్లు మార్కెట్లో...

రివోల్ట్‌ నుంచి తక్కువ ధరలో ఆర్‌వీ 1

ముంబై: రతన్‌ ఇండియా పెట్టుబడులున్న రివోల్ట్‌ మోటార్‌ తక్కువ ధరలో ఆర్‌వీ 1 ఎలక్ట్రిక్‌ బైక్‌ను త్వర లో మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రస్తుతం ఆ సంస్థ కు చెందిన ఆర్‌వీ 400, ఆర్‌వీ 300 మోడళ్లు మార్కెట్లో ఉన్నాయి. దశలవారీగా ఆర్‌వీ 300 మోడల్‌ను మార్కెట్‌ నుంచి తొలగించి తక్కువ ధరలో ఆర్‌వీ 1 మోడల్‌ ప్రవేశపెడతామని కంపెనీ ప్రకటించింది. ఇది పూర్తిగా దేశీయంగా తయారయ్యే బైక్‌ అని రతన్‌ ఇండియా ప్రమోటర్‌ అంజలి రతన్‌ తెలిపారు. ప్రస్తుతం వీటికి చెందిన కొన్ని విడి భాగాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఈ డిసెంబరు నాటికి తమ ఉత్పత్తులన్నీ పూర్తిగా దేశీయ విడిభాగాలతోనే తయారవుతాయని ఆమె చెప్పారు. 


రాబోయే ఏడాదిలోఈ-వాహనాల జోరు

దేశంలో రాబోయే 12 నెలల కాలంలో విద్యుత్‌ వాహనాల అమ్మకాలు గణనీయంగా పుంజుకుంటాయని ఎర్నె స్ట్‌ అండ్‌ యంగ్‌ తాజా నివేదికలో తెలిపింది. ఎలక్ర్టిక్‌ వాహనాల కోసం అధిక ధర చెల్లించేందుకు కూడా వినియోగదారులు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. 13 దేశాలకు చెందిన 9000 మందిని ఈ సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు. వారిలో వెయ్యి మంది భారతీయులున్నారు. ప్రతి 10 మందిలో ముగ్గురు ఎలక్ర్టిక్‌ వాహనాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. వాహనం చార్జింగ్‌ గంటలోపే జరగాలన్న ఆకాంక్ష పలువురు వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-07-26T07:21:15+05:30 IST