పుతిన్‌గారూ.. యుద్ధం ఆపండి!

ABN , First Publish Date - 2022-02-27T16:25:44+05:30 IST

ఉక్రెయిన్‌పై జరుపుతున్న యుద్ధాన్ని ఆపాలని కోరుతూ సేలంకు చెందిన దయాని అనే విద్యార్థిని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఈ-మెయిల్‌ సందేశం పంపింది. పొరుగుదేశమైన ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, ఆ

పుతిన్‌గారూ.. యుద్ధం ఆపండి!

                 - ఈ-మెయిల్‌ పంపిన సేలం విద్యార్థిని


చెన్నై: ఉక్రెయిన్‌పై జరుపుతున్న యుద్ధాన్ని ఆపాలని కోరుతూ సేలంకు చెందిన దయాని అనే విద్యార్థిని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఈ-మెయిల్‌ సందేశం పంపింది. పొరుగుదేశమైన ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, ఆ దేశంలో శాంతిని నెలకొల్పాలని భారత ప్రజల తరఫున అభ్యర్థిస్తున్నట్లు ఆమె రష్యా అధ్యక్షుడి మీడియా విభాగానికి చెందిన ఈ-మెయిల్‌కు లేఖను పంపింది. రెండేళ్ల కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల అన్ని దేశాలు ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో యుద్ధం ఆవశ్యకతపై ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆమె హితవు పలికింది. యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో లక్షలాదిమంది ప్రాణభయంతో అన్న పానీయాలకు అలమటించే పరిస్థితులు ఏర్పడ్డాయని, యుద్ధం కొనసాగితే మరిన్ని దేశాలు ఆర్థికంగా క్షీణిస్తాయని కూడా ఆ విద్యార్థిని పేర్కొంది. తన కోరికను మన్నించి పుతిన్‌ యుద్ధవిరమణ ప్రకటన చేయాలని వేడుకుంటున్నానంటూ దయాని ఆ లేఖను ముగించింది.

Updated Date - 2022-02-27T16:25:44+05:30 IST