రష్యాలో ఏడు లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-09T01:16:42+05:30 IST

రష్యాలో గడిచిన 24 గంటల్లో 6,562 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది.

రష్యాలో ఏడు లక్షలు దాటిన కరోనా కేసులు

మాస్కో: రష్యాలో గడిచిన 24 గంటల్లో 6,562 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో రష్యాలో మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. రష్యాలో ఇప్పటివరకు మొత్తంగా 7,00,792 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 1,812 మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించలేదని అధికారులు చెప్పారు. మాస్కోలోని 84 ప్రాంతాల నుంచి కొత్త కేసులు బయటపడినట్టు అధికారులు తెలిపారు. సెవాస్టపోల్ నగరంలో గడిచిన 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదుకాలేదని పేర్కొన్నారు. రష్యా రాజధాని మాస్కోతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. మరోపక్క గడిచిన 24 గంటల్లో రష్యాలో 173 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10,667కు చేరుకుంది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్, ఇండియా మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. నాలుగు, ఐదు స్థానాల్లో రష్యా, పెరు దేశాలున్నాయి.

Updated Date - 2020-07-09T01:16:42+05:30 IST