చక్కెర కోసం సూపర్ మార్కెట్లో దెబ్బలాడుకున్న రష్యన్లు.. !

ABN , First Publish Date - 2022-03-23T02:13:17+05:30 IST

పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యాలో కనీసావసరాలకు కొరత ఏర్పడుతోంది. తాజాగా.. ఓ సూపర్‌మార్కెట్‌లో చక్కెర కోసం కొందరు రష్యన్లు దెబ్బలాడుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చక్కెర కోసం సూపర్ మార్కెట్లో దెబ్బలాడుకున్న రష్యన్లు.. !

ఎన్నారై డెస్క్: పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యాలో కనీసావసరాలకు కొరత ఏర్పడుతోంది. తాజాగా.. ఓ సూపర్‌మార్కెట్‌లో చక్కెర కోసం కొందరు రష్యన్లు దెబ్బలాడుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో చూపించిన దాని ప్రకారం.. సూపర్ మార్కెట్ సిబ్బంది ఒకరు..గుమిగూడిన కస్టమర్ల ముందుకు  చక్కెర ప్యాకెట్లను ఉన్న ఓ షాపింగ్ ట్రాలీని తోశారు. వెంటనే.. ఆ ట్రాలీపై ఎగబడ్డ రష్యన్లు వీలైనన్ని ప్యాకెట్లు సొంత చేసుకునేందుకు ప్రయత్నించారు. 


ఈ క్రమంలో కొందరి మధ్య తగాదా తలెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే..రష్యాలో చక్కెర ధరలు ఇటీవలకాలంలో ఏకంగా 12.8శాతం పెరిగాయి. కండోమ్స్ అమ్మకాలు కూడా విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ఆర్థిక ఆంక్షల కారణంగా రష్యా కరెన్సీ రూబుల్ విలువ విపరీతంగా పడిపోతోంది. ఫలితంగా దిగుమతుల కోసం డాలర్లలో చెల్లింపులు చేయడం రష్యాకు భారంగా మారి.. ధరల పెరుగుదలకు కారణమవుతోంది. 

Updated Date - 2022-03-23T02:13:17+05:30 IST