Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 31 Mar 2022 01:18:31 IST

డ్రోన్లతో కొట్టారు!

twitter-iconwatsapp-iconfb-icon
డ్రోన్లతో కొట్టారు!

65 కిలోమీటర్ల మేర ఉన్న రష్యన్ల కాన్వాయ్‌ని ధ్వంసం చేసిన ఉక్రెయిన్‌ డ్రోన్‌ విభాగం

రష్యన్‌ సేనలను నిలువరించడంలో కీలకపాత్ర


దాదాపు 65 కిలోమీటర్ల మేర విస్తరించిన రష్యన్‌ సైనిక దళాల కాన్వాయ్‌! ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు సమీపంలో దండువిడిసిన ఆ సుదీర్ఘ వాహన శ్రేణి చూస్తూచూస్తుండగానే ధ్వంసమైపోయింది!! 65 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న సాయుధ సైనిక, రవాణా వాహనాలను.. అదీ బాహుబలిలాంటి రష్యా సైన్యం వాహనాలను నాశనం చేయాలంటే ఉక్రెయిన్‌ ఎంతటి శక్తిని, శక్తిమంతమైన ఆయుధాలను ఉపయోగించిందో కదా!! ఈసందేహం చాలా మందికి వస్తుంది. కానీ.. దుస్సాధ్యమైన ఈ కార్యాన్ని ఉక్రెయిన్‌ ప్రత్యేక దళాలకు చెందిన కేవలం 30 మంది డ్రోన్‌ ఆపరేటర్లు క్వాడ్‌ బైకుల సాయంతో చేశారంటే నమ్మగలరా? అవును.. ఇది నిజం. బైబిల్‌ కథల్లో అత్యంత శక్తిమంతుడైన గోలియత్‌ను ఎదిరించిన సామాన్య డేవిడ్‌లా.. ఈ డ్రోన్‌ ఆపరేటర్లే రష్యా మోహరించిన సాయుధ వాహనాల కాన్వాయ్‌పై బాంబుల వర్షం కురిపించి సర్వనాశనం చేసింది. 


ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన వెంటనే రష్యా ఈ కాన్వాయ్‌ని కీవ్‌ దిశగా నడిపించింది. ఆ నగరాన్ని సునాయాసంగా జయించగలనని భావించింది. కానీ, అదంత ఈజీ కాదని అర్థం కావడానికి రష్యాకు ఆట్టే సమయం పట్టలేదు. ఆ కాన్వాయ్‌ అనుకున్న వేగంతో ముందుకు సాగకుండా.. ఉక్రెయిన్‌ ప్రత్యేక దళాలకు చెందిన 30 మంది డ్రోన్‌ ఆపరేటర్లు వాటిపై అర్ధరాత్రి దాడులు చేయడం ప్రారంభించారు. ఈ యూనిట్‌ పేరు.. ఏరోరోజ్‌విడ్కా. ఈ విభాగానికి చెందిన డ్రోన్‌ ఫైటర్లు.. తొలినాళ్లలోనే చెర్నోబిల్‌ వైపు నుంచి కీవ్‌ దిశగా రాత్రిపూట క్వాడ్‌ బైకులపై ప్రయాణించి,  రష్యన్‌ సేనల కాన్వాయ్‌ ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. 


వారి డ్రోన్లకు థర్మల్‌ ఇమేజింగ్‌ కెమెరాలతోపాటు.. కిలోన్నర బరువుండే చిన్నచిన్న బాంబులను అమర్చి, కంప్యూటర్‌ ద్వారా డ్రోన్‌ను ఆపరేట్‌ చేస్తూ.. రష్యన్‌ ట్యాంకులపైకి వాటిని తీసుకెళ్లి ఆ చిన్న బాంబును దానిపై జారవిడిచే లా చేశారు. వారు రష్యన్ల కాన్వాయ్‌లో ముందున్న మూడు వాహనాలను ధ్వంసం చేయడంతో కాన్వాయ్‌ ముందుకు కదలడం కష్టమైపోయింది. రష్యన్లకు తగిలిన పెద్ద దె బ్బ అది. ఆ తర్వాత వారు.. రష్యన్ల కాన్వాయ్‌కు ఆహారం, చమురు సరఫరా చేసే డి పోపై దాడి చేశారు. దీంతో కాన్వాయ్‌ పూర్తి గా నిలిచిపోయింది. అలా ఆగిపోవడం డ్రోన్‌ యూనిట్‌కు మరింత కలిసి వచ్చింది. ప్రతిరోజూ కొన్ని వాహనాల చొప్పున దాదాపు మొత్తం కాన్వాయ్‌ను ధ్వంసం చేయగలిగా రు. వారు ప్రత్యక్షంగా యుద్ధరంగంలో ఉం డరు కాబట్టి.. ఎక్కడో దూరం నుంచి కంప్యూటర్‌ ద్వారా డ్రోన్లను నడిపించడం వల్ల ఈ యూనిట్‌కు ప్రాణనష్టం వాటిల్లలేదు.


సైనికులు కాదు.. స్వచ్ఛందంగా..

నిజానికి ఈ యూనిట్‌లో ఉన్నవారంతా శిక్షణ పొందిన సైనికులు కాదు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ఐటీ నిపుణులు, హాబీగా డ్రోన్లపై పరిశోధనలు చేసేవారు. ఉదాహరణకు.. ఈ యూనిట్‌ వ్యవస్థాపకుడు వోలోడిమిర్‌ కొచెత్కోవ్‌ సుకచ్‌ ఒక ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకర్‌. డ్రోన్లపై ఆయనకు ఆసక్తి. 2015లో డోన్‌బా్‌స ప్రాంతంలో జరిగిన ఒక దాడిలో ఆయన చనిపోయారు. అలాగే, ప్రస్తుత కమాండర్‌ హోంకర్‌ మాజీ సైనికుడు, ఐటీ మార్కెటింగ్‌ కన్సల్టెంట్‌. టారస్‌ అనే మరో సైనికుడు.. మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌. 2014లో.. ఉక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఎనిమిదేళ్ల క్రితం వీరందరితో కలిపి ఈ యూనిట్‌ ఏర్పాటు చేశారు. 


మొదట్లో మార్కెట్లో దొరికే వాణిజ్య డ్రోన్లతోనే పనిచేసేవారు. తర్వాత్తర్వాత ఇందులోని ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్‌ డిజైనర్లు కలిసి సొంతంగా డ్రోన్లను అభివృద్ధి చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారు.. బాంబులను, రాకెట్‌-ప్రొపెల్డ్‌ యాంటీ ట్యాంక్‌ గ్రనేడ్సను జారవిడిచే సామర్థ్యం గల ఎనిమిది రెక్కల పెద్ద డ్రోన్లను (1.5 మీటర్ల నిడివితో) తయారుచేశారు. ఈ డ్రోన్లను నడపడానికి డెల్టా అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. అయితే, యుద్ధాలేవీ జరగకపోవడంతో 2019లో ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి ఈ యూనిట్‌ను రద్దు చేశారు. పుతిన్‌ తీరుతో మళ్లీ గత ఏడాది అక్టోబరులో పునరుద్ధరించారు. రష్యన్ల దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో ఇంటర్‌నెట్‌ వ్యవస్థ దెబ్బతినడంతో.. ప్రస్తుతం ఈలన్‌మ్‌స్కకు చెందిన స్టార్‌లింక్‌ ఉపగ్రహ వ్యవస్థ సాయంతో పనిచేస్తున్నారు. 


ఎయిర్‌పోర్టునూ కాపాడారు

రష్యన్ల కాన్వాయ్‌ని నాశనం  చేయడమే కాదు.. ఉక్రెయిన్‌లోని హోస్టోమెల్‌ ఎయిర్‌పోర్టుపై రష్యా చేసిన గగనతల దాడిని విఫలం చేయడంలో కూడా ఈ విభాగం సహాయం చేసింది. ఈ విమానాశ్రయం కీవ్‌ నగరానికి వాయవ్యంగా ఉంది. యుద్ధం మొదలైన మొదటిరోజే రష్యా ఈ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడానికి 200 పారాట్రూపర్లను పంపింది. హోస్టోమెల్‌ ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకుంటే కీవ్‌పై దాడి రష్యాకు మరింత సులభమై ఉండేది. కానీ, ఆ పారాట్రూపర్లను గుర్తించి, లక్ష్యంగా చేసుకుని బాంబులు కురిపించడం ద్వారా ఉక్రెయిన్‌ డ్రోన్‌ యూనిట్‌ రష్యా ప్రణాళికను భగ్నం చేసింది.


-సెంట్రల్‌ డెస్క్‌

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.