Russian soldier కి జీవితకాల జైలుశిక్ష.. Ukrain కోర్ట్ తీర్పు

ABN , First Publish Date - 2022-05-24T00:17:27+05:30 IST

నిరాయుధుడైన ఉక్రెయిన్ పౌరుడిని హత్య చేసినందుకుగానూ రష్యన్ సైనికుడికి జీవితకాల జైలుశిక్ష పడింది. ఈ మేరకు ఉక్రెయిన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ సోమవారం తీర్పునిచ్చింది.

Russian soldier కి జీవితకాల జైలుశిక్ష.. Ukrain కోర్ట్ తీర్పు

కీవ్ : నిరాయుధుడైన ఉక్రెయిన్ పౌరుడిని హత్య చేసిన ఓ రష్యన్ సైనికుడికి (Russia soldier) జీవితకాల జైలుశిక్ష(life in prison) విధిస్తూ ఉక్రెయిన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ సోమవారం తీర్పునిచ్చింది. రష్యా సైన్యంలో ట్యాంక్ కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్న 21 ఏళ్ల సెర్గియెంట్ వదిమ్ షిషిమరిన్‌కు ఈ  శిక్షపడింది. ఫిబ్రవరి 28న ఈశాన్య ఉక్రెయిన్‌లోని చుపఖివ్కా గ్రామానికి చెందిన 62 ఏళ్ల వ్యక్తిని షిషిమరిన్ తుపాకీతో కాల్చిచంపాడు. ఓపెన్ టాప్ కారులోంచి తుపాకీతో కాల్చిచంపాడు. అనంతరం ఉక్రెయిన్ దళాలకు పట్టుబడ్డాడు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం మొదలైన 4 రోజులకు ఈ దాడి జరిగిందని కోర్ట్ పేర్కొంది. అయితే కోర్ట్ తీర్పు వెలువడినా రష్యా సైనికుడు షిషిమరిన్‌లో ఎలాంటి భావోద్వేగం కనిపించలేదు. కాగా ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా విధ్వంసం ప్రారంభమైంది. తొలి రోజుల్లో జరిగిన నేరాలపై ట్రయల్స్‌లో భాగంగా సోమవారం మొదటి తీర్పు వెలువడింది. 


ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ఆరంభమైన తొలినాళ్లలో ఈ ఘటన జరిగింది. ఉక్రెయిన్ బలగాలు వెంబడిస్తుండడంతో నలుగురు రష్యా సైనికులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు కారును దొంగిలించేందుకు 62 ఏళ్ల వృద్ధుడిని కాల్చిచంపారు.  నిందితుల్లో షిషిమరిన్ కూడా ఉన్నాడని, ఇతడే కాల్చిచంపాడని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. కాగా కాల్చేయాలంటూ తనకు ఆదేశాలు రావడంతోనే కాల్పులు జరిపానని షిషిమరిన్ వివరించాడు. ఒక రౌండ్ కాల్పులు జరిపాను. బాధిత వ్యక్తి కుప్పకూలిపోయాడని నేరాన్ని అంగీకరించాడు.

Updated Date - 2022-05-24T00:17:27+05:30 IST