యుద్ధం ఆపేది ఎప్పుడో చెప్పేసిన పుతిన్

ABN , First Publish Date - 2022-03-07T01:23:29+05:30 IST

మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం భీకరంగా జరుగుతోన్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

యుద్ధం ఆపేది ఎప్పుడో చెప్పేసిన పుతిన్

మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం భీకరంగా జరుగుతోన్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. నాటోలో చేరకపోవడంతో పాటు తాము గతంలో చేసిన డిమాండ్లకు ఉక్రెయిన్ పూర్తిగా అంగీకరిస్తేనే సైనిక చర్యలు ఆపుతామని పుతిన్ తేల్చి చెప్పారు. కేవలం బలగాలను సమీకరించుకునేందుకు ఉక్రెయిన్ సంప్రదింపులను పొడిగిస్తూ పోతే సహించేది లేదని కుండబద్దలు కొట్టారు. తదుపరి విడత చర్చల్లో అయినా ఉక్రెయిన్ నిర్మాణాత్మక చర్చలు జరుపుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. విదేశీ భాగస్వాములతో కూడా చర్చలు జరిపేందుకు కూడా సిద్ధమని పుతిన్ స్పష్టం చేశారు.  


మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మ్యాక్రాన్‌తో ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధంపై దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. 


అటు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పుతిన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు. ఉక్రెయిన్‌ విషయంలో పుతిన్ ఫెయిల్ అవుతున్నారని చెప్పారు.  

Updated Date - 2022-03-07T01:23:29+05:30 IST