యుద్ధ వేళ పుతిన్‌పై 5 పుకార్లు

ABN , First Publish Date - 2022-05-05T19:51:33+05:30 IST

మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమై 2 నెలలు ముగిశాయి. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.

యుద్ధ వేళ పుతిన్‌పై 5 పుకార్లు

మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమై 2 నెలలు ముగిశాయి. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. వీటిలో 5 ప్రముఖంగా ప్రచారమౌతున్నాయి. 


క్యాన్సర్ సర్జరీ


పుతిన్‌‌కు క్యాన్సర్ ఉందని చికిత్స చేయించుకోబోతున్నారని ఈయూ, అమెరికన్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. చికిత్స నేపథ్యంలో ఆయన కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని న్యూయార్క్ పోస్ట్ కథనం రాసింది. 


కాస్మెటిక్ సర్జరీ


పుతిన్‌ ముఖానికి కాస్మెటిక్ సర్జరీ అయిందని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారమైంది.


బాధ్యతలు వేరేవారికి అప్పగింత  


కేన్సర్ చికిత్స నేపథ్యంలో పుతిన్ తన బాధ్యతలను మాజీ కేజీబీ స్పై మాస్టర్ నిఖోలాయ్‌కు అప్పగిస్తారని అమెరికన్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. 


డూప్‌ను వాడుకోవడం 


యుద్ధ వేళ పుతిన్‌ తనకు డూప్‌ను వాడుతున్నారని ముఖ్యంగా ప్రజలకు కనిపించే సమయంలో పుతిన్ తన డూప్‌ను పంపుతున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. తనపై సైన్యం తిరుగుబాటు చేయవచ్చని, తనను అంతమొందించవచ్చనే భయంతో పుతిన్ ఇలా డూప్‌ను వాడుకుంటున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్లు ప్రచారమౌతున్నాయి. 


మానసిక జబ్బులు


పుతిన్ డెమెన్షియా, సిజోప్రెనియాలతో బాధపడుతున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ మానసిక జబ్బులున్నవారు తమ చుట్టూ ఉన్నవారినెవ్వరినీ నమ్మరని, తనకు వ్యతిరేకంగా కుట్రపన్నుతారనే భావనలో ఉంటారని కథనంలో ప్రస్తావించింది. తనకు భద్రత కల్పించే సిబ్బందిని కూడా పుతిన్ నమ్మడం లేదని అమెరికా, ఈయూ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. 

  

మీడియా కథనాల్లో వాస్తవం ఎలా ఉన్నా పుతిన్ సేనలు మాత్రం ఉక్రెయిన్‌లో  విధ్వంసం సృష్టిస్తున్నాయి. అనేక నగరాలను స్వాధీనం చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌లోని మిగతా కీలక నగరాలను స్వాధీనం చేసుకునేందుకు దూసుకెళ్తున్నాయి. 

Read more