మొహాలీలో Russian made rocket launcher స్వాధీనం
ABN , First Publish Date - 2022-05-11T16:49:33+05:30 IST
మొహాలీ దాడి పేలుడు జరిగిన ప్రదేశం సమీపంలో రష్యా తయారీ రాకెట్ లాంచర్‌ను పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మొహాలీ (పంజాబ్): మొహాలీ దాడి పేలుడు జరిగిన ప్రదేశం సమీపంలో రష్యా తయారీ రాకెట్ లాంచర్‌ను పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ యూనిట్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడికి సంబంధించిన దర్యాప్తులో ఇంటెలిజెన్స్ బ్యూరో భవనం నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న సైట్ నుంచి రాకెట్ లాంచర్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాకెట్-ప్రొపెల్డ్ గ్రెనేడ్ లేదా ఆర్పీజీ 22గా గుర్తించారు. ఈ రాకెట్ లాంచరును రష్యాలో తయారు చేశారని పోలీసులు గుర్తించారు.సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలను పిలిచారు.ఇద్దరు అనుమానితులు కారులో వచ్చి ఇంటెలిజెన్స్ కార్యాలయ భవనం వద్ద ఆర్‌పిజిని ప్రయోగించారు. రాకెట్‌తో నడిచే గ్రెనేడ్‌తో దాడి చేశారని పోలీసులు చెప్పారు.